Celebrities Education : ఈ స్టార్స్ ఏం చదివారో తెలుసా..!

మనకి తెలిసిన కొందరు నటీనటుల క్వాలిఫికేషన్ డీటెయిల్స్..

Celebrities Education : ఈ స్టార్స్ ఏం చదివారో తెలుసా..!

Celebrities Education

Celebrities Education: డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం అని ఎవరైనా నటీనటులు ఇంటర్వూల్లో చెప్తేనే కానీ వాళ్ల ఎడ్యుకేషన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సెలబ్రిటీల లగ్జీరియస్ లైఫ్ గురించి, రెమ్యునరేషన్ వంటి వివరాలు అడపాదడపా తెలుస్తుంటాయి కానీ వారి ఎడ్యుకేషన్‌కి సంబంధించిన విషయాలు బయటకి పెద్దగా తెలియవు. మనకి తెలిసిన కొందరు యాక్టర్ల క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం..

Heroines Remuneration: అడిగినంత ఇవ్వాల్సిందే..

అక్కినేని నాగార్జున..
నాగ్ అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అక్కడ చదువుకుంటూనే కొన్నాళ్ళు పార్ట్ టైం జాబ్ కూడా చేశారు. తర్వాత తండ్రి ఏఎన్నార్ నట వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటించారు కింగ్.

Nagarjuna

కాజల్ అగర్వాల్..
దశాబ్దానికి పైగా సౌత్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా సత్తా చాటిన కలువ కళ్ల చిన్నది కాజల్.. ముంబైలోని కేసీ కాలేజీలో మాస్ మీడియాలో మార్కెటింగ్ అండ్ అడ్వర్‌టైజింగ్ స్పెషలైజేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత మోడలింగ్ వైపు ఆ తర్వాత సినిమాలవైపు టర్న్ అయింది కాజల్ కెరీర్..

Kajal Aggarwal

రెబల్ స్టార్ ప్రభాస్..
పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తెలుగులో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని పాన్ ఇండియా స్టార్ అనే స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్.. మొదట హైదరాబాద్‌లోని నలంద కాలేజీలో ఇంటర్మీడియట్ ఆ తర్వాత శ్రీ చైతన్యలో బీటెక్ చదివారు.

Prabhas

సాయి పల్లవి..
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి.. జార్జియాలోని బిలిసి మెడికల్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఆ తర్వాత కొద్దికాలం ట్రైనీ డాక్టర్‌గా కూడా వర్క్ చేశారు. మాతృభాష మలయాళంలో ‘ప్రేమమ్’ మూవీతో పరిచయమై తెలుగు, తమిళ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Sai Pallavi

సూపర్‌స్టార్ మహేష్ బాబు..
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సూపర్ స్టార్ డమ్‌ని సొంతం చేసుకున్న మహేష్.. చైన్నైలోని లయోలా కాలేజీలో బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్ కంప్లీట్ చేశారు. స్కూలింగ్ టైంలో హాలిడేస్ అప్పుడు ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రి సినిమాల్లో నటించేవారు సూపర్ స్టార్..

Mahesh Babu

శృతి హాసన్..
విశ్వనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్ట్రెస్‌గా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌‌లో గుర్తింపు తెచ్చుకున్న శృతి.. ముంబైలోని సెయింట్ ఆండ్రీవ్ కాలేజ్ నుండి సైకాలజీలో పట్టా పొందింది.

Shruti Hassan

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..
మెగా – అల్లు ఫ్యామిలీ నుంచి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్‌గా టర్న్‌ అయిన బన్నీ.. చెన్నైలోని ఎంఎస్ఆర్ కాలేజీలోబ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కంప్లీట్ చేశారు.

Allu Arjun

రకుల్ ప్రీత్ సింగ్..
అతి తక్కువ టైంలోనే బాలీవుడ్, టాలీవుడ్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాక యంగ్ ఎంట్రప్రెన్యూర్‌గా మారిన రకుల్ ప్రీత్ ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన జీసస్ అండ్ మేరీ కాలేజీలో మేథమెటిక్స్లో గ్రాడ్యేయేషన్ కంప్లీట్ చేశారు.

Rakul Preet Singh

విజయ్ దేవరకొండ..
రౌడీ స్టార్, యూత్ స్టైలిష్ ఐకాన్.. విజయ్ దేవరకొండ అనంతపూర్‌లోని సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. తర్వాత హైదరబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఆ తర్వాత బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ‘నువ్విలా’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాల్లో చిన్న క్యారెక్టర్లలో కనిపించి, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుండి సినిమా సినిమాకి తన కెరీర్ గ్రాఫ్ బిల్డ్ చేసుకుంటూ పాన్ ఇండియా స్టార్ రేంజ్‌కి ఎదిగాడు విజయ్.

Vijay Deverakonda

రాశీ ఖన్నా..
బ్యాటిఫుల్ యాక్ట్రెస్ కమ్ సింగర్.. ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా స్కూలింగ్ అంతా సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్లో జరిగింది. తర్వాత ఢిల్లీలోని లేడి శ్రీరామ్ కాలేజ్‌లో బి.ఎ.(ఇంగ్లీష్) కంప్లీట్ చేసింది. జాన్ అబ్రహం ‘మద్రాస్ కేఫ్’ తో ఇంట్రడ్యూస్ అయిన రాశీ తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ నుండి కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది.

Raashi Khanna