Heroines Remuneration: అడిగినంత ఇవ్వాల్సిందే..

బ్యాక్ టు బ్యాక్ 2, 3 హిట్లొచ్చాయో లేదో, స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులు కొట్టేశారో లేదో.. కోట్లకు కోట్లు అడుగుతున్నారు ఈ ముద్దుగుమ్మలు..

Heroines Remuneration: అడిగినంత ఇవ్వాల్సిందే..

Remuneration

Heroines Remuneration: బేసిక్‌గా హిందీ హీరోయిన్లు అయినా.. అక్కడ అంత సక్సెస్ రాకపోయినా, పెద్దగా పట్టించుకోకపోయినా.. తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి రెమ్యునరేషన్ విషయంలో మాత్రం చుక్కలు చూపిస్తుంటారు కొంతమంది హీరోయిన్లు. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ 2, 3 హిట్లొచ్చాయో లేదో, స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులు కొట్టేశారో లేదో.. కోట్లకు కోట్లు అడుగుతున్నారు ఈ ముద్దుగుమ్మలు.

Kondaveedu : ఆక్సిజన్ మీద సినిమా.. అందర్నీ ఆకట్టుకుంటుంది..

నార్త్ బేస్డ్ హీరోయిన్స్ అయినా.. మన తెలుగు వాళ్లు మాత్రం ఏరికోరి ఎంతిచ్చైనా తెచ్చుకుంటారు వాళ్లని. అందుకే కొత్తలో హిందీలో పెద్దగా ఛాన్సులు లేకపోయినా, అక్కడ అంత సక్సెస్ రాకపోయినా.. తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి మాత్రం రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తుంటారు. లేటెస్ట్‌గా రామ్ చరణ్ సినిమాలో మరోసారి హీరోయిన్‌గా చేస్తున్న కియారా అద్వానీ ఇప్పుడు 4 కోట్లు డిమాండ్ చేస్తోంది. అటు హిందీలో సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా బిజీ అవుతోంది కాబట్టే.. 4 కోట్లు ఇవ్వాల్సిందే అంటోంది ఈ బోల్డ్ బ్యూటీ..

Kiara Advani : కియారా కమిట్‌మెంట్.. శంకర్‌తో ఎన్ని సినిమాలంటే..

సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే స్పీడ్‌కి, సక్సెస్‌కి బ్రేకుల్లేకుండా పోయాయి. అదే రేంజ్‌లో రెమ్యునరేషన్ కూడా పెంచేస్తోంది. సౌత్‌లో చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు తమిళ్‌లో స్టార్ హీరో విజయ్‌తో కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు నార్త్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు మరికొంతమంది హీరోల సినిమాలతో బిజీగా ఉన్న పూజా.. టాలీవుడ్‌లో డిమాండ్ ఉంది కాబట్టి ఎంతైనా అడగొచ్చు అని ఫిక్స్ అయ్యినట్టుంది. అందుకే 3 కోట్ల మాట ఎప్పుడో దాటి.. 5 వరకూ వెళుతోందని టాక్.

R K Selvamani : ఇది మంచిది పద్ధతి కాదు.. పూజా హెగ్డేపై రోజా భర్త ఫైర్..

మరో సౌత్ హీరోయిన్ నయనతార కూడా బాగానే డిమాండ్ చేస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్లు కరువవ్వడంతో నయనతార వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది. దాంతో నయన్ రెమ్యునరేషన్ 6 కోట్లు దాటేసింది. ఇప్పటికే లేడీ సూపర్‌స్టార్ హోదాతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఫుల్ బిజీగాఉన్న నయనతారతో సినిమా చెయ్యాంటే అడిగినంత ఇవ్వాల్సిందే.