Kondaveedu : ఆక్సిజన్ మీద సినిమా.. అందర్నీ ఆకట్టుకుంటుంది..

‘బిగ్ బాస్ 5’ ఫేమ్ శ్వేత వర్మ హీరోయిన్‌‌గా నటించిన ‘కొండవీడు’ సినిమాలోని ‘నిన్న మొన్న దాకా’ అనే లిరికల్ సాంగ్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటోంది..

Kondaveedu : ఆక్సిజన్ మీద సినిమా.. అందర్నీ ఆకట్టుకుంటుంది..

Kondaveedu

Kondaveedu: సినిమా మీద ప్యాషన్‌తో.. ఫస్ట్ సినిమాతోనే యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు యంగ్ అండ్ టాలెంటెడ్ పర్సన్ భోదనపల్లి ప్రతాప్ రెడ్డి. దశరాజు గంగా భవాని, బోధనపల్లి అలివేల సమర్పణలో.. బీపీఆర్ సినిమాస్ బ్యానర్ మీద బోధనపల్లి ప్రతాప్ రెడ్డి, దశరాజు మధుసూధన రాజు కలిసి నిర్మిస్తున్న సినిమా ‘కొండవీడు’. ఈ సినిమాతో సిద్ధార్థ్ శ్రీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Bigg Boss 5 : బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్వేత వర్మ కన్ఫమ్..!

శ్రీకృష్ణ గొర్లె హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రీసెంట్‌గా ‘బిగ్ బాస్’ సీజన్ 5లో పార్టిసిపెట్ చేస్తున్న శ్వేతా వర్మహీరోయిన్. ఎంట్రీలోనే హోస్ట్ నాగార్జునతో సహా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారామె. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్‌ని ఇటీవల నటుడు సునీల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండో లిరికల్ సాంగ్ హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైంది. సాంగ్ విన్న శ్రీకాంత్ చాలా బాగుందని.. ఆక్సిజన్ మీద తీసిన ఈ సినిమా కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందంటూ మూవీ టీంకి విషెస్ తెలిపారు. ఈ సెకండ్ సాంగ్‌కి కనిష్క ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. భాషాశ్రీ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. యాజిన్ నిజార్ అద్భుతంగా పాడారు.

 

 

Kondaveedu

Kondaveedu

‘నిన్న మొన్న దాకా.. నాకు సొంతమైన చిట్టి గుండెకేదో అయ్యిందే.. ఉండినట్టే ఉండి మాయమై పోయిందే.. ఎక్కడెక్కడంటూ చెట్టుకొమ్మలెక్కి.. చుట్టు దాని కోసం చూస్తుంటే.. చంటి పాపలాగా వెంట నీతో వెళుతోందే.. నీలి నీలి కన్నుల నీ సంద్రం అలలా గుండె తాకెనే.. ఆగలేని నావలా.. నా ప్రాణం చేపలా దూకి ఆడెనే.. నిజంగా ఇదంతా.. నీ మాయ నా చెలి.. మౌనంగా దింపావే.. ప్రేమలో మరి’.. అంటూ సాగే పాట యూత్‌ని బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘కొండవీడు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.