Sonu Sood Net Worth : సోను సూద్ నికర విలువ ఎంత? ఈ రియల్ హీరో మోడలింగ్ కెరీర్ నుంచి ఎలా ఎదిగాడు? ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడు?

Sonu Sood Net Worth : సోను సూద్ నికర విలువ ఎంత? ఆయన సంపాదనకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

Sonu Sood Net Worth : సోను సూద్ నికర విలువ ఎంత?  ఈ రియల్ హీరో మోడలింగ్ కెరీర్ నుంచి ఎలా ఎదిగాడు? ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడు?

Sonu Sood Net Worth Revealed

Updated On : December 20, 2025 / 9:03 PM IST

Sonu Sood Net Worth : సోను సూద్.. ఈయనకు పరిచయం అక్కర్లేదు.. సినీ నటుడుగానే కాకుండా ఎంతోమందికి సహాయం చేసి ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా COVID-19 మహమ్మారి సమయంలో సోను సూద్ వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో ఆయన చాలా మందికి ఎంతో సహాయం చేశాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజలు సోను సూద్ నుంచి సహాయం కోసం వేడుకున్నారు. ఆ సమయంలో తనకు వీలైనంత సహాయం అందరికి చేశాడు.

ఇంకా, చాలా మంది ఎప్పటికప్పుడు సోను సూద్ నుంచి ఇప్పటికీ సాయం కోరుతూనే ఉన్నారు. సినిమా పరిశ్రమలోనే కాకుండా వ్యాపార ప్రపంచంలో కూడా ఎంతో పాపులారిటీ సంపాదించాడు. ఎన్నో సామాజిక సేవలందించిన సోను సూద్‌కు మంచి పేరుతో పాటు ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి. తాను సాయం చేసేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇటీవలే అక్రమ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఈడీ మొత్తం రూ. 7.93 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

ఈ ఆస్తులు బాలీవుడ్ నటుడు సోను సూద్ సహా ఇతర ప్రముఖ వ్యక్తులకు చెందినవి. పలువురు క్రికెటర్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. సోను సూద్‌కు ఈడీ జప్తు చేసిన ఆస్తి రూ. కోటి అని తెలిసింది. అంతేకాదు.. సోను సూద్ బిలియన్ల ఆస్తులు కూడా ఉన్నాయట..

మోడలింగ్ తో కెరీర్ మొదలై.. :

పంజాబ్‌లోని మోగాలో సోను సూద్ జన్మించాడు. ఆయన మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పుట్లో నాగ్‌పూర్‌లోని యశ్వంతరావు చవాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదువుతున్నాడు. నటనపై ఇష్టంతో 1998లో ముంబైకి వెళ్లాడు. 1999లో ఆయన తమిళ చిత్రం “కల్లజగర్”తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అనేక బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు.

సోను సూద్ నికర విలువ ఎంతంటే? :
మీడియా నివేదికల ప్రకారం.. సోను సూద్ నికర విలువ దాదాపు రూ. 140 కోట్లు (సుమారు 1.4 బిలియన్ డాలర్లు). ఆయన సంపాదన సినిమాలు, ఎండార్స్‌మెంట్‌లు, బిజినెస్ నుంచే వస్తుంది. ఆయన ఒక్కో చిత్రానికి సుమారు రూ. 2 నుంచి ₹3 కోట్లు (సుమారు 20 మిలియన్ డాలర్లు) రెమ్యూనురేషన్ తీసుకుంటారట.

Read Also : EV Car Servicing Guide : మీకు ఎలక్ట్రిక్ కారు ఉందా? సర్వీసింగ్ సమయంలో ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. తప్పక గుర్తుంచుకోండి.. కంప్లీట్ గైడ్..!

సోను సూద్ బిజినెస్‌లో కూడా బాగా పాపులర్.. ఆయన తండ్రి పేరు మీద శక్తి సాగర్ ప్రొడక్షన్స్‌ను రన్ చేస్తున్నాడు. సోషల్ మీడియా-ట్రావెల్ యాప్ ఎక్స్‌ప్లర్గర్ సహ వ్యవస్థాపకుడు కూడా. టెక్ స్టార్టప్‌లలో కూడా పెట్టుబడులు పెట్టాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల కోసం ఆయన రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్లు (సుమారు 10 మిలియన్ డాలర్లు) సంపాదిస్తాడట.

రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు :
సోను సూద్ రియల్ ఎస్టేట్‌లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయన తన భార్య, పిల్లలతో కలిసి ముంబైలోని అంధేరిలో ఒక లగ్జరీ 4BHK అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఈ ఇల్లు 2,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఆస్తి విలువ దాదాపు రూ. 20 కోట్లు. అంధేరీతో పాటు, సోను సూద్‌కు జుహులో మరో 8 ఆస్తులు ఉన్నాయి. ఇందులో 6 రెసిడెన్సీ ప్రాపార్టీలు, రెండు కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. పేదల కోసం రూ. 10 కోట్లు సేకరించేందుకు ఆయన డిసెంబర్ 2020లో ఈ ప్రాపర్టీలను తనఖా పెట్టినట్లు సమాచారం.

ఆయనకు హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో కూడా ఒక లగ్జరీ ఇల్లు ఉంది. సోను సూద్ కు మోగాలో పూర్వీకుల ఆస్తి కూడా ఉంది. రెండు నెలల క్రితం అక్టోబర్‌లో తన కుమారుడు ఇషాన్ సూద్‌తో కలిసి పన్వేల్‌లో రూ.1.05 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశాడు.

సోను సూద్‌కు కార్లంటే ఇష్టం :
సోను సూద్ కూడా కార్లంటే చాలా ఇష్టం . ఆయన దగ్గర రూ. 3.35 కోట్లు (1.35 మిలియన్ డాలర్లు) విలువైన మెర్సిడెస్-మేబాచ్ GLS600 కారు ఉంది. ఆయన కారులో BMW 7-సిరీస్ (రూ.1.37 కోట్లు), ఆడి Q7 (రూ. 8.8-9.7 మిలియన్లు) కూడా ఉన్నాయి. ఆయన కార్లతో పాటు, రోలెక్స్, ఆడెమర్స్ పిగ్యుట్, హబ్లాట్ వంటి అద్భుతమైన లగ్జరీ స్మార్ట్ వాచ్ కూడా ఉంది.