Best 5G Mobile Phones : ఇలాంటి ఫోన్లు కావాలా? రూ. 10వేల లోపు ధరలో బెస్ట్ 5G మొబైల్స్ ఇవే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి
Best 5G Mobile Phones : ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సందర్భంగా రూ. 10వేల లోపు ధరలో అద్భుతమైన 5జీ మెబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best 5G Mobile Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీరు ఈ ఏడాది చివరిలోపు కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే.. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో, శాంసంగ్, మోటోరోలా, వివో వంటి బ్రాండ్‌లతో సహా రూ. 10వేల లోపు అనేక బ్రాండెడ్ ఫోన్‌లను కొనేసుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్లు క్యాష్‌బ్యాక్, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో అందుబాటులో ఉన్నాయి. కొన్ని 12GB ర్యామ్, 50MP కెమెరాతో కూడా వస్తాయి. ఈ ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.

వివో Y19e 5G : ఈ వివో హ్యాండ్‌సెట్ 64GB స్టోరేజ్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.8995కి కొనుగోలు చేయవచ్చు. 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో ఇంటికి తెచ్చుకోవచ్చు. రూ.317 నుంచి ఈఎంఐలో కూడా లభిస్తుంది. అదనంగా, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఇంకా తక్కువ ధరకు పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6.74-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది యూనిసోక్ T7225 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 13MP మెయిన్ కెమెరా 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

మోటోరోలా G35 5G : ఈ లిస్టులో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ కలిగిన మోటరోలా ఫోన్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ. 9999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా అందుబాటులో ఉంది. 12GB ర్యామ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లే, 50MP మెయిన్ కెమెరా , 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ F05 5G : ఈ శాంసంగ్ 5G ఫోన్ 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మీరు కేవలం రూ. 6499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. రూ. 229 నుంచి ఈజీ ఈఎంఐ ఆప్షన్ తో కూడా కొనుగోలు చేయవచ్చు. తద్వారా మరింత సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల పరంగా పరిశీలిస్తే.. 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ కోసం హెలియో G85 చిప్‌సెట్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.
