వజ్ర కవచధర గోవింద ఫస్ట్ లుక్

సప్తగిరి హీరోగా నటిస్తున్న వజ్ర కవచధర గోవింద సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : January 28, 2019 / 05:37 AM IST
వజ్ర కవచధర గోవింద ఫస్ట్ లుక్

సప్తగిరి హీరోగా నటిస్తున్న వజ్ర కవచధర గోవింద సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్.

కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తున్న సినిమా, వజ్ర కవచధర గోవింద.. అరుణ్ పవార్ డైరెక్ట్ చేస్తుండగా, శివ శివమ్ ఫిలింస్ బ్యానర్‌పై, నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. వైభవీ జోషీ హీరోయిన్. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కాషాయ వస్త్రాల్లో, కమండలం పట్టుకుని, జీప్‌పై కూర్చుని ఉన్నాడు సప్తగిరి. ఈ సినిమాలో గోవింద్ అనే దొంగ క్యారెక్టర్‌లో సప్తగిరి కనిపించబోతున్నాడు. ఒక దొంగ తనకున్న లక్ష్యాలను ఎలా నెరవేర్చుకున్నాడు, వాటి వెనకున్న పరిణామాలు ఏంటి అనే పాయింట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కామెడీతో పాటు, సెంటిమెంట్ అండ్ యాక్షన్ కూడా పుష్కలంగా ఉంటుందట.

ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో మైసూరులోని మెల్కొటే టెంపుల్‌లో 10 రోజుల పాటు జరగబోయే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమాకి కథ : జీటీఆర్ మహేంద్ర,  కెమెరా : ప్రవీణ్ వనమాలి, సంగీతం : బుల్ గనిన్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి, ఎడిటర్ : కిషోర్ మద్దాలి, స్టంట్స్ : స్టంట్స్ జాషువా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అరుణ్ పవార్.