Premi Vishwanath : వంటలక్క ఈజ్ బ్యాక్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన కార్తీకదీపం సీరియల్ యూనిట్..

తాజాగా వంటలక్క మళ్ళీ సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు చిన్న ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో చూపించిన దాని ప్రకారం వంటలక్క ప్రమాదంలో చనిపోలేదని, గాయాలతో బయటపడి కోమాలోకి వెళ్లినట్లు....................

Premi Vishwanath : వంటలక్క ఈజ్ బ్యాక్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన కార్తీకదీపం సీరియల్ యూనిట్..

karthika deepam

Updated On : August 13, 2022 / 12:27 PM IST

Premi Vishwanath :  కొన్ని రోజుల క్రితం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ సీరియల్ గా ఉంది కార్తీక దీపం. డాక్టర్ బాబు – వంటలక్క క్యారెక్టర్స్ కి జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. వంటలక్క క్యారెక్టర్ చేసిన మలయాళం ఆర్టిస్ట్ ప్రేమి విశ్వనాథ్ కి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాదాపు మూడు సంవత్సరాలకు పైగా ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో కొనసాగింది.

అయితే సీరియల్ కి ముగింపు ఇవ్వకపోయినా డాక్టర్ బాబు, వంటలక్క క్యారెక్టర్స్ ని యాక్సిడెంట్ చేసి చంపేశారు. 20 సంవత్సరాల తర్వాత అంటూ పిల్లలు పెద్దయిన తర్వాత నుంచి కథని మొదలుపెట్టారు. వంటలక్క క్యారెక్టర్ వెళ్లిపోవడంతో సీరియల్ రేటింగ్ గణనీయంగా తగ్గింది. కథ కూడా అంత ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ సీరియల్ ఫేమ్ తగ్గిపోయింది. దీంతో బాగా ఆలోచించి ఈ సీరియల్ దర్శక నిర్మాతలు మళ్ళీ వంటలక్క క్యారెక్టర్ (ప్రేమి విశ్వనాథ్) ని తీసుకొద్దామని ఫిక్స్ అయ్యారు.

Surekhavani : సురేఖవాణికి మళ్ళీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు.. ఇలాంటి అబ్బాయి కావాలని సురేఖ..

తాజాగా వంటలక్క మళ్ళీ సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు చిన్న ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో చూపించిన దాని ప్రకారం వంటలక్క ప్రమాదంలో చనిపోలేదని, గాయాలతో బయటపడి కోమాలోకి వెళ్లినట్లు, ఎవరో తనని కాపాడినట్టు తెలుస్తుంది. ఈ ప్రోమోలో సడెన్ గా వంటలక్క కోమాలోంచి లేచి డాక్టర్ బాబు అని అరవడం చూపించారు. దీంతో ఈ ప్రోమో చూసి ప్రేమి విశ్వనాథ్ అభిమానులు, ఈ సీరియల్ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కథ మరో కొత్త మలుపు తీసుకోబోతుందని అర్ధమవుతుంది. వంటలక్క ఎంట్రీతో సీరియల్ మళ్ళీ టాప్ లోకి వస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రేమి విశ్వనాధ్ కూడా తన సోషల్ మీడియాలో నేను మళ్ళీ మీ కోసం కార్తీకదీపం సీరియల్ లోకి వస్తున్నాను అని పోస్ట్ చేసింది.