Saindhav : పాన్ ఇండియా లెవెల్‌లో వెంకీ మామ ల్యాండ్ మార్క్ మూవీ.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్!

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాని ప్రకటించాడు. ఏ మాత్రం ఊహించని విధంగా వెంకీ మామ తన ల్యాండ్ మార్క్ మూవీని సిద్ధం చేస్తున్నాడు. ఈ సోమవారం ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేసిన వెంకటేష్ అదిరిపోయే వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు.

Saindhav : పాన్ ఇండియా లెవెల్‌లో వెంకీ మామ ల్యాండ్ మార్క్ మూవీ.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్!

Saindhav : టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాని ప్రకటించాడు. ఏ మాత్రం ఊహించని విధంగా వెంకీ మామ తన ల్యాండ్ మార్క్ మూవీని సిద్ధం చేస్తున్నాడు. ఈ సోమవారం ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేసిన వెంకటేష్ అదిరిపోయే వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. ఈరోజు 11:07 నిమిషాలకు టైటిల్ అనౌన్స్ చేస్తూ రెండు నిముషాలు నిడివి ఉన్న గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వెంకటేష్ కూల్ అండ్ మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టేశాడు.

Victory Venkatesh: త్వరలో ఘర్షణ సీక్వెల్ రాబోతుంది.. కన్ఫర్మ్ చేసిన గౌతమ్ మీనన్!

వీడియో గ్లింప్స్ లో సౌత్ ఇండియాలోని ఒక పోర్ట్ ఏరియాని చూపించారు. ఈ వీడియోలో వెంకటేష్ నడుచుకుంటూ వెళ్లి.. బైక్ మీద ఉన్న బాక్స్ లో నుంచి కెమికల్ బాంబు ఒకటి తీసి చూస్తాడు. ఆ తరువాత వెపన్స్ ఉన్న కంటైనర్ లోకి వెళ్లి గన్ తీసుకోని బయటకి వచ్చి బైక్ మీద కూర్చొని డైలాగ్ చెబుతాడు. ‘నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను, రమ్మను’ అని ముందు కొట్టిపడేసిన రౌడీలకు చెబుతాడు. టీజర్ చూస్తుంటే గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘సైంధవ్‌’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్నట్లు గ్లింప్స్ లో తెలియజేశారు. అలాగే షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు వెల్లడించారు.

ఈ మూవీకి ‘హిట్’ వర్స్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ భాద్యతలు కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ కి అప్పజెప్పడం ఏంటని చాలా మంది అనుకున్నారు. కానీ నేడు గ్లింప్స్ చూశాక అందరి అభిప్రాయాలు మారాయి. ఒక్కసారిగా సినిమా పై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించబోతున్నాడు. సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల గురించి త్వరలో వెల్లడించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.