Victory Venkatesh: త్వరలో ఘర్షణ సీక్వెల్ రాబోతుంది.. కన్ఫర్మ్ చేసిన గౌతమ్ మీనన్!
తమిళ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఘర్షణ, 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో వెంకటేష్ ని చూపించడమే కాకుండా, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు సినిమాని విజయం దిశగా పయనించేలా చేశాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ తమిళ్ హీరో శింబుతో తెరకెక్కించిన "లైఫ్ అఫ్ ముత్తు" ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూ లకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో ఘర్షణ మూవీ గురించి ప్రశ్నించగా, దానికి దర్శకుడు బదులిస్తూ..

Gautham Menon Gives Clarity on Gharshana Sequel
Victory Venkatesh: తమిళ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఘర్షణ, 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో వెంకటేష్ ని చూపించడమే కాకుండా, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు సినిమాని విజయం దిశగా పయనించేలా చేశాడు. ఇక ఈ మూవీకి హరీష్ జైరాజ్ ఇచ్చిన సంగీతం అయితే సినిమాకు ఊపిరి అనే చెప్పాలి.
Gautham Menon: ‘సమంత-చైతన్య’ల విడాకులపై.. “ఏ మాయ చేసావే” డైరెక్టర్ గౌతమ్ మీనన్ స్పందన
ప్రస్తుతం గౌతమ్ మీనన్ తమిళ్ హీరో శింబుతో తెరకెక్కించిన “లైఫ్ అఫ్ ముత్తు” ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూ లకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో ఘర్షణ మూవీ గురించి ప్రశ్నించగా, దానికి దర్శకుడు బదులిస్తూ.. త్వరలో ఘర్షణకు సీక్వెల్ రాబోతున్నట్టు వెల్లడించాడు.
ఇటీవలే వెంకటేష్ గారిని కలవడం జరిగిందని, అయన కూడా ఘర్షణ సీక్వెల్ చేదాం అని అడిగాడని, దానిపై తాను స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా.. అంటూ డైరెక్టర్ గౌతమ్ మీనన్ బదులిచ్చాడు. కాగా తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని తో ఉండబోతున్నట్టు కూడా ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.