10 interesting points about nitish kumar: నితీష్ కుమార్ గురించి 10 ఆసక్తికర అంశాలు

10 interesting points about nitish kumar: నితీష్ కుమార్ గురించి 10 ఆసక్తికర అంశాలు

10 interesting points about nitish kumar

Updated On : August 10, 2022 / 4:01 PM IST

10 interesting points about nitish kumar: బిహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్.. అతి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. పదవీ కాలం విషయంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చమ్లింగ్ ఉన్నప్పటికీ.. ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత మాత్రం నితీష్‭కే దక్కింది. పాలన 16 ఏళ్లు పూర్తి కావస్తున్న నితీష్.. ఎప్పటికప్పుడు కూటములు మారుస్తూ వస్తున్నారు. నిలకడలేని నేతనే విమర్శలు ఉన్నప్పటికీ.. కుర్చీని కాపాడుకోవడంతో నితీష్ రాజనీతి వేరనే వారు కూడా లేకపోలేదు. ఏమైతేనేమి.. నాలుగు రోజులుగా దేశంలో రాజకీయ ప్రకంపణలు సృష్టించిన నితీష్ గురించి చాలా మందికి తెలియని ఒక 10 ఆసక్తిని కలిగించే అంశాలు మీకోసం..

1. నితీష్ కుమార్ ముద్దు పేరు మున్నా. ఈ పేరుతో పాటు ఇంట్లో వారు సుశాసన్ బాబు అని కూడా పిలుస్తుండేవారు.
2. నితీష్ కుమార్ తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, అలాగే ఆయుర్వేద వైద్యం కూడా చేసేవారు.
3. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన నితీష్.. బిహార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పని చేశారు.
4. 1971లో రాం మనోహర్ లోహియా పార్టీ యూత్ వింగ్ సమాజ్‭వాదీ యువజన సభతో రాజకీయ ప్రవేశం చేశారు.
5. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్‭తో కలిసి మాజీ ప్రధాని ఇందిరా విధించిన ఎమర్జేన్సీలో పోరాటం చేశారు.
6. మొట్టమొదటి సారి 1985లో బిహార్ అసెంబ్లీకి నితీష్ ఎన్నికయ్యారు.
7. 1987లో యువ లోక్ దళ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండేళ్ల తర్వాత జనతా దళ్ సెక్రెటరీ జనరల్ అయ్యారు.
8. 1989లో మొదటిసారి బిహార్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
9. 2000లో నితీష్ మొదటిసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు (వారంలోనే ఆయన ప్రభుత్వం కూలిపోయింది). అనంతరం 2005లో రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. (మధ్యలో జితన్ రాం మాంఝీ 2014-2015 వరకు సీఎంగా ఉన్నారు)
10. నితీష్ కుమార్‭కు నిశాంత్ అనే కుమారుడు ఉన్నాడు. భార్యతో విడాకులు అయ్యాయి.

Nitish kumar: బీజేపీ టార్గెట్ నితీష్ ‭కుమారేనా?