Sanatana Dharma Row: సనాతన ధర్మం గురించి సరిగానే చెప్పాడు.. ఉదయనిధికి సపోర్ట్ చేసిన కట్టప్ప

ఈ వివాదం ముగుస్తుందని అనుకున్న సమయంలోనే డీఎంకేకు చెందిన మరో నేత ఏ.రాజా మరోసారి నిప్పుడు రగిల్చారు. సనాతన ధర్మం హెచ్ఐవీ, కుష్ఠురోగమంటూ ఆయన విరుచుకుపడ్డారు

Sanatana Dharma Row: సనాతన ధర్మం గురించి సరిగానే చెప్పాడు.. ఉదయనిధికి సపోర్ట్ చేసిన కట్టప్ప

Acrto Sarhyaraj: సనాతన ధర్మం గురించి వ్యాఖ్యానించిన ఉదయనిధికి తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రాజకీయ రంగం నుంచే కాకుండా తమిళ సినిమా రంగం నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే డైరెక్టర్ పా.రంజిత్ తన మద్దతును ప్రకటించగా.. తాజాగా సత్యరాజ్ కూడా తన మద్దతును ప్రకటించారు. అంతే కాదు, సనాతన ధర్మం గురించి ఉదయనిధి చాలా స్పష్టంగా మాట్లాడారని, ఆయన ధైర్యానికి మెచ్చుకుంటున్నట్లు కొనియాడారు.

Sanatana Dharma Row: డీఎంకేకు షాక్.. సనాతన ధర్మ వివాదంపై ఉదయనిధిని తప్పుపట్టిన కాంగ్రెస్

ఒకవైపు ఈ వ్యాఖ్యలపై రైట్ వింగ్ గ్రూపులు సహా ఇతరులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే.. మరొకవైపు ఇలా మద్దతు రావడం గమనార్హం. కాగా, ఈ విషయమై సత్యరాజ్ మాట్లాడుతూ.. తాను ఉదయనిధి వైపేనని స్పష్టం చేశారు. ఉదయనిధి అన్న మాటల్లో తప్పేముందని సత్యరాజ్ ప్రశ్నించారు. ఉదయనిధి నిర్భయంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని, సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు. ఇంత ధైర్యంగా తన అభిప్రాయాలు వెల్లడించినందుకు ఆయనను అభినందిస్తున్నానని సత్యరాజ్ తెలిపారు. ఓ మంత్రిగా ఉదయనిధి కార్యాచరణ, వ్యవహార శైలి పట్ల గర్విస్తున్నామని అన్నారు.

Sanatana Dharma Row: సనాతన ధర్మ వివాదంపై ఇండియా కూటమిలో తలో మాట.. ఎన్నికల నాటికి కూటమి ఉంటుందా?

కాగా, ఈ వివాదం ముగుస్తుందని అనుకున్న సమయంలోనే డీఎంకేకు చెందిన మరో నేత ఏ.రాజా మరోసారి నిప్పుడు రగిల్చారు. సనాతన ధర్మం హెచ్ఐవీ, కుష్ఠురోగమంటూ ఆయన విరుచుకుపడ్డారు. అయితే ఈ వివాదంలో తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన విశ్వకర్మయోజన పథకాన్ని కూడా మధ్యలోకి లాగడం విశేషం. ఇక ఉదయనిధిని తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం వెనకేసుకొచ్చారు. సనాతన ధర్మం ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకమని అన్నారు. ఉదయనిధి తప్పేమీ చెప్పలేదని, అయితే తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.