Nikki Yadav Case: ఢిల్లీ యువతి మృతదేహాన్ని ఫ్రిడ్జిలో ఉంచిన ఘటన.. చంపేముందు ఎంజాయ్ చేసిన ప్రియుడు

ఫిబ్రవరి 9న గెహ్లాట్ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థ వేడుకలో గెహ్లాట్ తన మిత్రులతో కలిసి ఆడి పాడుతూ హాయిగా గడిపాడు. అనంతరం నిక్కీ యాదవ్ తో గెహ్లాట్ కు గొడవ జరిగింది. ఆమెను గొంతునులిమి చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిడ్జిలో పెట్టాడు. ఆ తదుపరి రోజే గెహ్లాట్ పెళ్లి జరిగింది. నిక్కీ యాదవ్ హత్య ఉదంతం ఫిబ్రవరి 14న వెలుగులోకి వచ్చింది.

Nikki Yadav Case: ఢిల్లీ యువతి మృతదేహాన్ని ఫ్రిడ్జిలో ఉంచిన ఘటన.. చంపేముందు ఎంజాయ్ చేసిన ప్రియుడు

Nikki CCTV footage

Nikki Yadav Case: నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన నిక్కీ యాదవ్ (23) హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిక్కీ యాదవ్ ను హత్య చేసేముందు ధాబా యజమాని గెహ్లాట్ (24) తన మిత్రులతో బాగా ఎంజాయ్ చేశాడు. నిక్కీ యాదవ్ తో సహజీవనం చేస్తూనే గెహ్లాట్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 9న గెహ్లాట్ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థ వేడుకలో గెహ్లాట్ తన మిత్రులతో కలిసి ఆడి పాడుతూ హాయిగా గడిపాడు. అనంతరం నిక్కీ యాదవ్ తో గెహ్లాట్ కు గొడవ జరిగింది. ఆమెను గొంతునులిమి చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిడ్జిలో పెట్టాడు. ఆ తదుపరి రోజే గెహ్లాట్ పెళ్లి జరిగింది. నిక్కీ యాదవ్ హత్య ఉదంతం ఫిబ్రవరి 14న వెలుగులోకి వచ్చింది.

నిక్కీ యాదవ్ కోసం గాలించిన పోలీసులు గెహ్లాట్ ను ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. నిశ్చితార్థ వేడుకలో ఎంజాయ్ చేసిన అనంతరం గెహ్లాట్ నేరుగా ఉత్తమ్ నగర్ లో నిక్కీ యాదవ్ ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లాడు. ఆ రాత్రంతా ఆమెతోనే ఉన్నాడు. పొద్దున్నే కారులో కశ్మీర్ గేట్ వద్దకు వెళ్లారు. తన పెళ్లి గురించి నిక్కీకి గెహ్లాట్ చెప్పాడు. మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని నిక్కీ నిలదీసింది.

దీంతో ఆమెను గొంతు నులిమి చంపేసి, ఆమె మృతదేహాన్ని నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లోని తన ధాబాకు తీసుకువచ్చాడు గెహ్లాట్. ఆ తర్వాత నాలుగురోజులకి పోలీసులు నిక్కీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గెహ్లాట్ నుంచి పోలీసులు మిగతా వివరాలు రాబడుతున్నారు. నిక్కీ యాదవ్ ఉత్తమ్ నగర్ లో అద్దెకు గది తీసుకుని నివసించేదని పోలీసులు చెప్పారు. నిక్కీతో సాహిల్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. నిక్కీతో సంబంధాన్ని కొనసాగిస్తూనే మరో అమ్మాయితో సాహిల్ పెళ్లి కుదుర్చుకున్నాడు.

Most Congested City in India: మన దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఏదో తెలుసా?