Rajasthan: దళిత బాలుడి మృతిని ఖండిస్తూ రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజీనామా అనంతరం మెఘవాల్ మాట్లాడుతూ ‘‘జలోర్‭లో వెలుగు చూసిన 9 ఏళ్ల విద్యార్థి మరణం నన్ను ఎంతగానో బాధించింది. అందుకే నేను నా రాజీనామాను సమర్పించారు. ప్రతి రోజు దళితులు, నిమ్న వర్గాలు అనేక రకాల దాడులకు, హింసకు గురవుతున్నారు. వ్యవస్థలో చాలా మార్పులు ఇంకా మిగిలే ఉన్నాయి. దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు చేసుకుంటోంది. కానీ సామాజికంగా వెనుకబడిన వారి పిరస్థితిలో ఆశించిన మార్పు రాలేదు’’ అని అన్నారు.

Rajasthan: దళిత బాలుడి మృతిని ఖండిస్తూ రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Congress MLA Panachand Meghwal resigns over death of Dalit boy in Jalore district

Rajasthan: రాజస్తాన్‭లో 9 ఏళ్ల దళిత బాలుడి మృతిని ఖండిస్తూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే పానాచంద్ మేఘవాల్ తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులు, అణగారిన వర్గాల ప్రజలు తరుచూ దాడులకు, హింసకు గురవుతున్నారని, జలోర్‭లో దాడికి గురైన బాలుడి మరణం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. చిన్నారి మృతి పట్ల అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు సహా ముఖ్యమంత్రి గెహ్లోత్ రాజీనామా చేయాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్ నుంచి మొదటి ఎమ్మెల్యే రాజీనామా చేశారు.

రాజీనామా అనంతరం మెఘవాల్ మాట్లాడుతూ ‘‘జలోర్‭లో వెలుగు చూసిన 9 ఏళ్ల విద్యార్థి మరణం నన్ను ఎంతగానో బాధించింది. అందుకే నేను నా రాజీనామాను సమర్పించారు. ప్రతి రోజు దళితులు, నిమ్న వర్గాలు అనేక రకాల దాడులకు, హింసకు గురవుతున్నారు. వ్యవస్థలో చాలా మార్పులు ఇంకా మిగిలే ఉన్నాయి. దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు చేసుకుంటోంది. కానీ సామాజికంగా వెనుకబడిన వారి పిరస్థితిలో ఆశించిన మార్పు రాలేదు’’ అని అన్నారు.

దీనికి ముందు ఈ ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంతటి హృదయ విదారక సంఘటనను ఖండించడం చాలా తక్కువని, ఇలాంటివి రాజస్తాన్ రాష్ట్రంలో షరా మామూలు అయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ రాజస్తాన్‭లో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని, అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్ రాష్ట్రం జలోర్ జిల్లాలో ఉన్న సురానా అనే గ్రామంలో జూలై 20న ఒక ప్రైవేటు స్కూలులో చదువుతున్న 9 ఏళ్ల బాలుడు.. స్కూల్లో ఉన్న నీటి కుండలోని నీళ్లు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న ఈ స్కూల్లోని టీచర్.. విద్యార్థిని చావగొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని బుద్ధులు నేర్పే బడిలో జరిగిన దారుణం ఇది.

Bommai on Nehru row: అంబేద్కర్‫‭ని మరిపించేందుకే ఇవన్నీ.. ‘నెహ్రూ’ పోస్టర్ వివాదంపై సీఎం బొమ్మై