Uttar Pradesh : సాయం కోరి వచ్చిన వ్యక్తికి శిక్ష విధించిన ప్రభుత్వ అధికారి.. విధుల నుంచి తొలగింపు

ఉత్తరప్రదేశ్‌లో సాయం కోరి వచ్చిన ఓ వ్యక్తికి పనిష్మెంట్ ఇచ్చి అవమానించాడు ఓ ప్రభుత్వ అధికారి. ప్రాథమిక విచారణలో అతను తప్పు చేసాడని రుజువు కావడంతో విధుల నుంచి తొలగించారు.

Uttar Pradesh : సాయం కోరి వచ్చిన వ్యక్తికి శిక్ష విధించిన ప్రభుత్వ అధికారి.. విధుల నుంచి తొలగింపు

Uttar Pradesh

Updated On : September 16, 2023 / 11:51 AM IST

Uttar Pradesh : సాయం కోరి వచ్చిన ఓ వ్యక్తికి తన కార్యాలయంలో శిక్ష విధించాడు ఓ అధికారి. నానా దుర్భాషలాడాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ అధికారిని విధుల నుంచి తొలగించారు.

Uttar Pradesh: యూపీలో అమానవీయ ఉన్మాదం.. 5 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా చంపిన సాధువు

ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని మీర్‌గంజ్ పట్టణానికి చెందిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) ఉదిత్ పవార్ సాయం కోసం వచ్చిన వ్యక్తికి పనిష్మెంట్ ఇచ్చారన్న ఆరోపణలపై అతనిని విధుల నుంచి తొలగించారు. తమ గ్రామంలో స్మశానవాటిక కోసం అభ్యర్థించడానికి మూడవసారి వచ్చిన వ్యక్తిని పవార్ వంగి ఉండమని పనిష్మెంట్ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను అధికారి ఖండించారు. తను కార్యాలయానికి వచ్చేసరికి ఆ వ్యక్తి వంగి కూర్చుని ఉన్నాడని అలా ఎందుకు చేస్తున్నావని అడిగితే తనకు సాయం చేయమని అభ్యర్థిస్తున్నానని ఆ వ్యక్తి చెప్పినట్లు పవార్ చెబుతున్నారు.

తమ గ్రామం మందన్‌పూర్‌లో స్మశాన వాటిక లేదని.. దాని ఏర్పాటుకు సాయం చేయమని అడగటానికి గ్రామస్తులతో కలిసి సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లానని అయితే తన అప్లికేషన్‌ను పవార్ విసిరేసారని బాధితుడు ఆరోపించాడు. తనను వంగి ఉండమని పనిష్మెంట్ ఇచ్చారని.. నానా దుర్భాషలాడారని చెప్పాడు. స్మశానవాటిక కోసం జిల్లా యంత్రాంగం స్థలం ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు బాధితుడు చెప్పాడు.

Triple Talaq :యూపీలో దారుణం… నిఖా అయిన రెండు గంటలకే ట్రిపుల్ తలాఖ్

బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ శివకాంత్ ద్వివేది పవర్ కార్యాలయంలో ఓ వ్యక్తి అవమానకరమైన స్థితిలో కనిపించిన వీడియో తాను చూసానని.. ప్రాథమిక విచారణలో అధికారి నిర్లక్ష్యంగా ఉన్నాడని తేలిందని.. వెంటనే అతనిని పదవి నుంచి తొలగించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం పవార్‌కు కొత్తగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.