Madrassa Demolished: ఉగ్రవాద సంస్థతో సంబంధాలు.. మదరసా కూల్చేసిన అధికారులు

రాష్ట్రంలోని బొంగాయిగావ్ జిల్లా, కబైటరీ పార్ట్-4 గ్రామంలో ఉన్న మర్కజుల్ మా-అరిఫ్ క్వారియానా మదరసాను కూల్చేశారు. దీని కోసం ఎనిమిది బుల్డోజర్లను వినియోగించారు. మదరసాలోని ఓ బోధకుడు ముఫ్తీ హఫీజుర్ రహమాన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను అల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెట్ సభ్యుడని పోలీసులు తెలిపారు.

Madrassa Demolished: ఉగ్రవాద సంస్థతో సంబంధాలు.. మదరసా కూల్చేసిన అధికారులు

Madrassa demolished in assam over terror links

Madrassa Demolished: ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో అస్సాంలోని ఒక మదరసాను అధికారులు బుధవారం కూల్చివేశారు. ఈ కారణంతో రాష్ట్రంలో నేలమట్టమైన మదరసాల్లో ఇది మూడవది. అస్సాం ముఖ్యమంత్రి మదరసాలపై ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మదరసాల్లో విద్య కాకుండా మతం గురించి ఎక్కువగా చెప్తున్నారని వందల కొద్ది మదరసాలను మూసివేశారు. కాగా, ఉగ్రవాద ఆరోపణలతో తాజాగా కూల్చివేతకు పాల్పడుతుండడం విశేషం. కూల్చివేతకు ముందు దీనిలో ఉంటున్న 200 మంది విద్యార్థులను మంగళవారం ఖాళీ చేయించారు.

రాష్ట్రంలోని బొంగాయిగావ్ జిల్లా, కబైటరీ పార్ట్-4 గ్రామంలో ఉన్న మర్కజుల్ మా-అరిఫ్ క్వారియానా మదరసాను కూల్చేశారు. దీని కోసం ఎనిమిది బుల్డోజర్లను వినియోగించారు. మదరసాలోని ఓ బోధకుడు ముఫ్తీ హఫీజుర్ రహమాన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను అల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెట్ సభ్యుడని పోలీసులు తెలిపారు. 2018లో ఈ మదరసాలో బోధకుడిగా ఇతను చేరినట్లు పేర్కొన్నారు. ఈ మదరసాలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో అభ్యంతరకరమైన వస్తువులు, సాహిత్యం బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు.

ఇక దీనికి తోడు మదరసా నిర్వహిస్తున్న రెండంతస్తుల భవనం ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు జిల్లా విపత్తు అధికారులు తెలిపారు. ఇదే ప్రాంగణంలో అనేక భవనాలు, లెక్కలేనంత మంది వ్యక్తులతో అనేక రకాల కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి పొందలేదని, కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా లేవని పేర్కొన్నారు. కొన్ని సంక్షోభాలను, విపత్తులను ఎదుర్కోవడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవని, తప్పించుకోవడానికి అవసమైన సదుపాయాలు సమకూర్చలేదని.. ఇత్యాది కారణాలను రిత్యా మదరసా కూల్చివేతకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

Operation Lotus: ‘ఆపరేషన్ కమలం’పై విచారణ జరపాలని కోరుతూ సీబీఐ ఆఫీస్ ముందు ఆప్ ధర్నా