Ginger Cultivation : ఖరీఫ్‌కు అనువైన అల్లం రకాలు.. అధిక దిగుబడికోసం మేలైన యాజమాన్యం  

ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు, మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు

Ginger Cultivation : ఖరీఫ్‌కు అనువైన అల్లం రకాలు.. అధిక దిగుబడికోసం మేలైన యాజమాన్యం  

Ginger Cultivation

Ginger Cultivation : మన దేశంలో అల్లం పంట సాగు విస్తీర్ణం 2 లక్షల 15వేల ఎకరాలు కాగా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో సుమారు 25వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఔషధ, సుగంధ ద్రవ్యపంటగా అల్లం ప్రాధాన్యత నానాటికి పెరుగుతుండటంతో మన ప్రాంతంలో ఈ ఏడాది దీని సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు.

Read Also : Sorghum Cultivation : జొన్న సాగుతో మంచి లాభాలు.. తక్కువ పెట్టుబడి.. తక్కువ రిస్క్..!

దీనివల్ల  కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంటసాగులో గత 3 సం.లుగా  రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు, మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. సత్తిబాబు

అల్లం. మన ప్రాంతంలో సుగంధ ద్రవ్యపు పంటగా.. ఏజన్సీ ప్రాంతాల్లో  అధికంగా సాగులో వున్న ఈ పంట, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం మూడునాలుగేళ్ల నుండే. సాగులో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పంటసాగులో అధిక దిగుబడల సాధనకు మార్గం సుగమం అవటంతోపాటు, గత మూడేళ్లుగా మంచి మార్కెట్ ధర లభించటంతో , రైతులు సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. అయితే అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం.

పాక్షికంగా నీడ వున్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. తెలంగాణాలో మెదక్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోను, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అల్లం పంటను సాగుచేస్తున్నారు. ప్రధానంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో చల్లని వాతావరణం ఉండటంతో ఇక్కడి రైతులు అనాదిగా అల్లం పంటను సాగుచేస్తూ ఉన్నారు.

ప్రస్తుతం అల్లం విత్తే సమయం . మే మొదటి వారం నుండి జూన్ 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది.  అయితే ఇక్కడి సంప్రదాయ పద్ధతిలో సాగుచేయడం వల్ల, ఆశించిన దిగుబడిని పొందలేకపోతున్నారు. అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు , ప్రోట్రే విధానంలో పెంచిన నారును నాటుకొని , మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. సత్తిబాబు.

Read Also : Paddy Cultivation : వరిలో ఎలుకలను అరికట్టే పద్ధతి.. నివారణకు ఎరతెర పద్ధతిని పాటిస్తున్న శాస్త్రవేత్తలు