హైదరాబాద్‌లో కొట్టేసి, సూడాన్‌లో అమ్మేస్తున్నారు.. సెల్‌ఫోన్ల చోరీ ముఠా అరెస్ట్

ఖరీదైన సెల్‌ఫోన్లు కొట్టేసి విదేశాల్లో అమ్మేస్తున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి ఏకంగా 703 ఫోన్లు సీజ్ చేశారు.

హైదరాబాద్‌లో కొట్టేసి, సూడాన్‌లో అమ్మేస్తున్నారు.. సెల్‌ఫోన్ల చోరీ ముఠా అరెస్ట్

Stolen Cell Phones Recovered: హైదరాబాద్ నగరంలో ఖరీదైన సెల్‌ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సూడాన్ దేశస్థులతో పాటు 17 మందిని అరెస్టు చేసి.. వారి నుంచి కోటి 75 లక్షల రూపాయల విలువైన 703 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ఫోన్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అన్‌లాక్ చేసి సూడాన్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు.

సీపీ ఏం చెప్పారంటే..

  • నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్‌గా చేసుకొని ఈ ముఠా మొబైల్ స్నాచింగ్ చేస్తుంది
  • కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నారు
  • రాత్రి 10 గంటలు తరువాత ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించాం
  • మూడు కమిషనరేట్లలో ఇలా మొబైల్ స్నాచింగ్ చేస్తుందీ ముఠా
  • రోజుకు 3 నుంచి నాలుగు కేసులు నమోదు అయ్యాయి
  • ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్న ముఠా ఇంటర్నేషనల్ ముఠాగా గుర్తించాం
  • హైదరాబాద్‌లో దొంగతనం చేసిన మొబైల్స్‌ను సూడాన్‌కు పంపుతున్నట్లు గుర్తించాము
  • సూడాన్ దేశానికి చెందిన ఐదుగురు ఇల్లిగల్‌గా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు గుర్తించాం
  • నిరుద్యోగ యువతకు జీతాలు ఇచ్చి మొబైల్ స్నాచింగ్ చేయిస్తున్నారు

Also Read: బాబోయ్ లారీలు.. హైదరాబాద్- విజయవాడ హైవేపై భయంకర యాక్సిడెంట్లు

  • ఈ కేసులో 12 నిందితులు హైదరాబాద్‌కి చెందిన వారు ఉన్నారు
  • స్నాచింగ్ చేసిన మొబైల్ ఫోన్స్ అమ్మకాలకు, రిసివింగ్‌కి జగదీష్ మార్కెట్ కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారింది
  • స్నాచింగ్ చేసిన మొబైల్ ఫోన్స్ పార్ట్స్ కూడా అమ్ముతున్నారు, జగదీశ్ మార్కెట్‌పై నిఘా పెంచాం