Petrol Price : పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలు.. తెలంగాణలో పలు చోట్ల రూ.107

Petrol Price : పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలు.. తెలంగాణలో పలు చోట్ల రూ.107

Petrol Price (2)

Petrol Price : గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు గురువారం పెరిగాయి. పెట్రోల్ పై 31 – 39 పైసలు పెరగ్గా, డీజిల్ పై 15-21 పైసలు పెరిగింది. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బంది ఎదురుకుంటున్నారు. జులై 6 నుంచి 15 మధ్య పెట్రోల్ పై 5 రూపాయలు పెరిగింది.

ఈ నెలలో వరుసగా 8 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. జూన్ నెలలో 16 సార్లు పెట్రోల్ డీజిల్ పై ధరలు పెంచారు. కాగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో మే 4కు ముందు 18 రోజులు పెట్రోల్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఎన్నికలు పూర్తీ కాగానే ఇంధన ధరలను పెంచడం మొదలు పెట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తైన తర్వాత ఇంధన ధరలు సుమారు 30 సార్లు పెరిగాయి.

ఇక దేశంలోని వివిధ నగరాల్లోని పెట్రోల్ రేట్లను ఓ సారి చూద్దాం

హైదరాబాద్ – పెట్రోల్ 105.52, డీజిల్ 97.96

ఢిల్లీ – పెట్రోల్ 101.54, డీజిల్ 89.87
ముంబై – పెట్రోల్ 107.54, డీజిల్ 97.45
కోల్ కత్తా – పెట్రోల్ 101.74, డీజిల్ 93.02
చెన్నై – పెట్రోల్ 102.23, డీజిల్ 94.39
నోయిడా – పెట్రోల్ 98.73, డీజిల్ 90.34
బెంగళూరు – పెట్రోల్ 104.94, డీజిల్ 95.26