Team India : 2026లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ఎన్ని వ‌న్డేల్లో ఆడే అవ‌కాశం ఉందో తెలుసా?

2026 ఏడాదిలో భార‌త జ‌ట్టు (Team India) ఎన్ని వ‌న్డేలు ఆడ‌నుందో ఓ సారి చూద్దాం..

Team India : 2026లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ఎన్ని వ‌న్డేల్లో ఆడే అవ‌కాశం ఉందో తెలుసా?

Do you how many ODIs play Team India in 2026 virat rohit plans

Updated On : December 31, 2025 / 3:55 PM IST

Team India :టెస్టులు, టీ20ల‌కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు ప్ర‌స్తుతం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ల‌క్ష్యంగా ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు ముందుకు సాగుతున్నారు. 2026 ఏడాదిలో రోహిత్‌, కోహ్లీలు ఎలా రాణిస్తారు అన్న‌దానిపైనే వారి భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది.

ఈ నేప‌థ్యంలో 2026లో భార‌త జ‌ట్టు ఎన్ని వ‌న్డేలు ఆడ‌నుంది? ఇందులో రో-కో ద్వ‌యం ఎన్ని వ‌న్డేలు ఆడే అవ‌కాశాలు ఉన్నాయో ఓ సారి చూద్దాం.

T20 World Cup 2026 : టీ20ప్ర‌పంచ‌క‌ప్ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించిన అఫ్గానిస్తాన్‌.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా.. 41 ఏళ్ల ఆట‌గాడికి చోటు..

2026లో భార‌త జ‌ట్టు మొత్తం 18 వ‌న్డే మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడ‌నుంది. ఈ ఏడాది (2025) లో జ‌ర‌గాల్సిన బంగ్లాదేశ్ టూర్ 2026కి వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఒక‌వేళ ఈ టూర్ జ‌రిగితే అప్పుడు వ‌న్డేల సంఖ్య కాస్త పెరిగే అవ‌కాశం ఉంది.

ఏడాది ఆరంభంలోనే..
కొత్త సంవ‌త్స‌రం ప్రారంభ‌నెల‌లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు అభిమానుల‌ను అల‌రించ‌నున్నారు. జ‌న‌వ‌రిలో న్యూజిలాండ్ జ‌ట్టు భార‌త్ లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య భార‌త్‌తో మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. జ‌న‌వ‌రి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

భార‌త్, కివీస్ వ‌న్డే షెడ్యూల్ ఇదే..

* తొలి వ‌న్డే – జనవరి 11న (వడోదర)
* రెండో వ‌న్డే – జనవరి 14న (రాజ్‌కోట్)
* మూడో వ‌న్డే – జనవరి 18న‌ (ఇండోర్)

ఈ సిరీస్ త‌రువాత మ‌ళ్లీ భార‌త జ‌ట్టు జూన్ నెల‌లో వ‌న్డేలు ఆడ‌నుంది. జూన్‌లో అఫ్గాన్ భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నుంది. అప్పుడు ఆతిథ్య భార‌త్‌తో అఫ్గాన్ మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. ఆ త‌రువాత జూలైలో టీమ్ఇండియా ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. అక్క‌డ ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మూడు వ‌న్డేలు ఆడ‌నుంది.

RCB : న్యూఇయ‌ర్‌కు ముందు ఆర్‌సీబీకి బిగ్‌షాక్‌..

ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగిసిన త‌రువాత అక్టోబ‌ర్‌లో స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో మూడు వ‌న్డేల్లో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్ ముగిసిన త‌రువాత న‌వంబ‌ర్‌లో భార‌త జ‌ట్టు న్యూజిలాండ్‌లో ప‌ర్య‌టించ‌నుంది. అక్క‌డ ఆతిథ్య కివీస్‌తో మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. ఆ త‌రువాత 2026 ఏడాది చివ‌రి నెల‌లో(డిసెంబ‌ర్‌)లో శ్రీల‌కంతో స్వ‌దేశంలో మూడు వ‌న్డేల సిరీస్ ఆడ‌నుంది.

మొత్తంగా 6 ద్వైపాక్షిక సిరీసుల్లో క‌లిపి భార‌త్ ఈ ఏడాది 18 వ‌న్డేలు ఆడ‌నుంది. గాయాలు, ఫిట్‌నెస్ స‌మస్య‌లు లేకుంటే రోహిత్‌, కోహ్లీలు అన్ని వ‌న్డేలు ఆడే అవ‌కాశం ఉంది.