Sara Tendulkar : న‌డి రోడ్డుపై బీర్‌బాటిల్‌తో స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్‌..! వీడియో వైర‌ల్‌..

స‌చిన్ టెండూల్క‌ర్ కూతురు సారా (Sara Tendulkar)కు సంబంధించిన ఓవీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Sara Tendulkar : న‌డి రోడ్డుపై బీర్‌బాటిల్‌తో స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్‌..! వీడియో వైర‌ల్‌..

Viral video Sachin Tendulkar Daughter Sara Tendulkar Spotted With Beer Bottle (pic credit @TheCricPundit)

Updated On : December 31, 2025 / 5:00 PM IST

Sara Tendulkar : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ చాలా కాలం క్రిత‌మే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన‌ప్ప‌టికి కూడా అత‌డిని అభిమానులు ఎవ్వ‌రూ మ‌రిచిపోలేరు. క్రికెట్‌లో ఆయ‌న నెలకొల్పిన రికార్డుల్లో కొన్నింటిని బ్రేక్ చేయ‌డం ఎవ్వ‌రికి సాధ్యం కూడా కాదు. అభిమానులు ముద్దుగా క్రికెట్ దేవుడు అని స‌చిన్‌ను పిలుచుకుంటూ ఉంటారు.

ఇక ఆయ‌న త‌న కెరీర్‌లో ఎన్న‌డూ కూడా వివాదాల జోలికి వెళ్ల‌లేదు. తాజాగా ఆయ‌న కూతురు సారా టెండూల్క‌ర్‌(Sara Tendulkar )కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వీడియోను బట్టి సారా టెండూల్క‌ర్ త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను గోవాలో సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ట్లుగా ఉంది. గోవా వీధుల్లో ఆమె చ‌క్క‌ర్లు కొడుతోంది. త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి సారా రోడ్డు పై న‌డుచుకుంటూ వెలుతోంది. అయితే.. ఆ స‌మ‌యంలో ఆమె చేతిలో బీర్ బాటిల్ ఉండ‌డం గ‌మ‌నార్హం.

Team India : 2026లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ఎన్ని వ‌న్డేల్లో ఆడే అవ‌కాశం ఉందో తెలుసా?

ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. ప‌బ్లిక్‌గా చేతిలో బీర్ బాటిల్ ఏంటి అంటూ కొంద‌రు ఆమెను విమ‌ర్శిస్తూ ఉంటే మ‌రికొంద‌రు మాత్రం ఆమెకు మ‌ద్ద‌తుగా కామెంట్లు చేస్తున్నారు.

T20 World Cup 2026 : టీ20ప్ర‌పంచ‌క‌ప్ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించిన అఫ్గానిస్తాన్‌.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా.. 41 ఏళ్ల ఆట‌గాడికి చోటు..