PM Modi: పానీ పూరీ టేస్ట్ చేసిన ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ఫ్యుమియో.. వీడియో వైరల్

జపాన్ ప్రధాని ఫ్యుమియో సోమవారం భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలో ఉన్న ఫ్యుమియోను మోదీ అక్కడి బుద్ధ జయంతి పార్కుకు తీసుకెళ్లారు. పార్కులోని బాల బోధి చెట్టు గురించి ఫ్యుమియోకు మోదీ వివరించారు. ఇద్దరూ పార్క్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా పార్కులో అందిస్తున్న ఫుడ్ టేస్ట్ చేశారు.

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ పానీ పూరీ (గోల్ గప్పా), లస్సీ టేస్ట్ చేశారు. జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదాతో కలిసి ఇండియన్ ఫేమస్ ఫు్డ్ ఐటమ్స్‌ను మోదీ రుచి చూశారు. జపాన్ ప్రధాని ఫ్యుమియో సోమవారం భారత పర్యటనకు వచ్చారు. 27 గంటలపాటు ఫ్యుమియో భారత్‌లో పర్యటిస్తారు.

Steve Smith: అద్భుతంగా క్యాచ్ పట్టిన స్మిత్.. ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’ అంటున్న జహీర్ ఖాన్… వీడియో ఇదిగో!

ఢిల్లీ చేరుకున్న ఆయనకు మోదీ ఘన స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని పెంచుకోవడంపై మోదీ, ఫ్యుమియో చర్చిస్తారు. ఈ చర్చల్లో భాగంగా రెండు దేశాల మధ్య రాబోయే ఐదేళ్లలో రూ.3,20,000 (రూ.3.2 లక్షల) కోట్ల వ్యాపార, వాణిజ్య అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంటారు. ఢిల్లీలో ఉన్న ఫ్యుమియోను మోదీ అక్కడి బుద్ధ జయంతి పార్కుకు తీసుకెళ్లారు. పార్కులోని బాల బోధి చెట్టు గురించి ఫ్యుమియోకు మోదీ వివరించారు. ఇద్దరూ పార్క్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా పార్కులో అందిస్తున్న ఫుడ్ టేస్ట్ చేశారు. మజ్జిగ, పానీ పూరీ, ఆమ్ పన్నా వంటి వాటి గురించి తెలుసుకున్నారు.

Karnataka Congress: కర్ణాటకలో నిరుద్యోగ భృతి.. ‘యువ నిధి’ పేరుతో ప్రతి నెలా రూ.3,000 ఇస్తామని కాంగ్రెస్ హామీ

కొద్దిసేపు మజ్జిగ చిలికారు. తర్వాత లస్సీ తాగారు. అనంతరం ఇద్దరూ పానీ పూరీ రుచి చూశారు. పానీ పూరీ గురించి ఫ్యుమియోకు మోదీ వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఫ్యుమియో తనను త్వరలో జరగబోయే జీ7 దేశాల సదస్సుకు ఆహ్వానించినట్లు మోదీ తెలిపారు. జపాన్‌లోని హిరోషిమాలో వచ్చే మేలో ఈ సదస్సు జరగబోతుంది. ఇండియా-జపాన్ మధ్య సంబంధాలు 2000 నుంచి అంతర్జాతీయ సంబంధాలుగా మారాయి. అప్పట్నుంచి క్రమంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి.

 

ట్రెండింగ్ వార్తలు