Punjabi AI Robot: వావ్.. మాట్లాడగలదు, బాంబులను నిర్వీర్యం చేయగలదు.. జస్ట్ 20వేలతో ఏఐ రోబో తయారు చేసిన స్కూల్ విద్యార్థులు..

6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఏఐ ఆధారంగా స్కూల్ లోని ల్యాబ్‌లో ఈ రోబోను తయారు చేశారు. దీనికి తలపాగ పెట్టి పంజాబీ లుక్​ తీసుకొచ్చారు.

Punjabi AI Robot: వావ్.. మాట్లాడగలదు, బాంబులను నిర్వీర్యం చేయగలదు.. జస్ట్ 20వేలతో ఏఐ రోబో తయారు చేసిన స్కూల్ విద్యార్థులు..

Updated On : December 10, 2025 / 5:41 PM IST

Punjabi Robot: ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ (ఏఐ) హవా నడుస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరిగింది. ఈ అత్యాధునిక సాంకేతికత ద్వారా అద్భుతాలు ఆవిష్కారం అవుతున్నాయి. తాజాగా పంజాబ్​లోని ప్రైవేట్​ స్కూల్ విద్యార్థులు ఏఐని ఉపయోగించి అద్భుత ఆవిష్కరణ చేశారు. దేశంలోనే తొలి సిక్కు రోబోను తయారు చేశారు. దీని తయారీకి కేవలం 20వేలు ఖర్చు అయ్యింది. అధునాతన టెక్నాలజీ ఏఐ ఇంటి పనులకు కూడా ఉపయోగపడేలా ఈ రోబోను తయారు చేశారు.

మానసా​ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు దీన్ని తయారు చేశారు. ఈ రోబో​కు జాన్ జీ అని పేరు పెట్టారు. 6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఏఐ ఆధారంగా స్కూల్ లోని ల్యాబ్‌లో ఈ రోబోను తయారు చేశారు. దీనికి తలపాగ పెట్టి పంజాబీ లుక్​ తీసుకొచ్చారు.

రోబో ప్రత్యేకతలు ఇవే..
* మాట్లాడగలదు
* ఇది పర్వత ప్రాంతాలకు కూడా వెళ్లగలదు, ఎత్తైన కొండలు ఎక్కగలదు.
* బాంబులను నిర్వీర్యం చేయగలదు.
* మంటలను అదుపు చేసే శక్తి కూడా ఉంది.
* ఎటువంటి సపోర్ట్​ లేకుండా ఈజీగా కదలగలదు.
* వర్షం పడినప్పుడు బయట ఆరబెట్టిన దుస్తులను తీసి లోపల పెట్టగలదు.
* ఇంట్లోని ఫ్యాన్లను ఆపగలదు.
* ఈ రోబో ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని స్పందించగలదు.
* విద్యార్థులు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది.
* దేశ ప్రధాని, పంజాబ్ సీఎం గురించి అడిగే ప్రశ్నలకు కూడా సమాచారం ఇస్తుంది.

ఈ రోబో తయారీ వెనుక ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులకు తగిన సమాచారం అందించడమే అని రోబో తయారీలో విద్యార్థులకు సాయపడిన టీచర్ అన్నారు. అలాగే ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు మొదట ఈ రోబో గ్యాస్‌ను ఆపివేసి, ఆపై మంటలను ఆర్పివేస్తుందన్నారు. భవిష్యత్తుల్లో ఈ రోబోపై మరింత పని చేస్తామన్నారు. ఈ రోబోకు పలు సెన్సార్లు కూడా ఉన్నాయని, ఏ పనైనా చాలా ఈజీగా చేస్తుందని టీచర్ తెలిపారు.

ఈ రోబో బ్యాటరీ సాయంతో నడుస్తుందని, 3 నెలల క్రితం ప్రయోగం ప్రారంభమైందని విద్యార్థులు తెలిపారు. ఖర్చు మొత్తం స్కూల్ యాజమాన్యం భరించిందన్నారు. ఇంటి పనులు కూడా చేసే విధంగా ఏఐ టెక్నాలజీతో రోబోను తయారు చేసినట్లు విద్యార్థులు వివరించారు. ఈ రోబోను ఇంటి పనులకు కూడా ఉపయోగించవచ్చని స్టూడెంట్స్ తెలిపారు.

Also Read: మార్కెట్ గేమ్ ఛేంజర్స్.. 2026లో రాబోయే 4 స్టన్నింగ్ బైకులివే.. ధర రూ. 5 లక్షల లోపే.. మీ ఫేవరెట్ బైక్ ఇదేనా?