Gold Rates : 2025లో సరికొత్త రికార్డులు సృష్టించిన బంగారం.. ధరలు పైపైకి..
గత పాతికేళ్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2000లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర..
2025 సంవత్సరంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. పసిడి ధర భారీగా పెరిగిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పుత్తడి ధరలు ఈ ఏడాదిలో ఆకాశాన్ని తాకాయి. ఎవరి ఊహాలకు, అంచనాలకు అందని విధంగా 2025లో బంగారం ధరలు పెరుగుతూ వెళ్లాయి. అయితే, పసిడి పరుగు ఇక్కడితో ఆగిపోదని.. ఫ్యూచర్ లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ప్రపంచంలో ఏ వస్తువు ధర పెరగనంతగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. గత 25 ఏళ్లలో ఊహించని స్థాయిలో పుత్తడి ధర ఎగబాకింది. ప్రపంచంలో ఏ వస్తువు ధర కానీ, లోహం ధర కానీ ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. అసలే భారతీయులకు బంగారమంటే చాలా ఇష్టం. శుభకార్యాలలో ఆభరణాలు ధరించి మురిసిపోతారు. ఇక, గిఫ్ట్ గానూ గోల్డ్ ఇస్తారు. అంతేకాదు.. ఈ మధ్య కాలంలో.. పసిడిని ఇన్వెస్ట్ మెంట్ గానూ చూస్తున్నారు. ఈ కారణంగా పసడి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి.
గత పాతికేళ్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2000లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 4వేల 400 రూపాయలుగా ఉంది. ఇప్పుడు అది ఏకంగా ఒక లక్ష 30వేలకు చేరింది. సుమారు 14 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో స్థిరంగా కొనసాగుతోంది. ఇక, ప్రస్తుతం 5 లక్షల విలువైన గోల్డ్ కొంటే..2030 నాటికి దాని విలువ 10 లక్షల రూపాయలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా వేశారు.
ఐదేళ్ల క్రితం బంగారం, మ్యూచువల్ ఫండ్స్ పై లక్ష రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. దేని విలువ ఎంత పెరిగిందో తెలుసుకుందాం. 2020 జనవరి 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 39వేల 200 రూపాయలుగా ఉంది. లక్ష రూపాయలకు 25.51 గ్రాముల గోల్డ్ వచ్చేది. ఇప్పుడు 10 గ్రాముల పుత్తడి ధర ఒక లక్ష 30వేల 310 రూపాయలుగా ఉంది. అంటే.. అప్పుడు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. ఇప్పుడు దాని విలువ 3లక్షల 25వేల రూపాయలు. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన లక్ష రూపాయలపై ఏడాదికి 12శాతం వడ్డీతో 2లక్షల రూపాయలకు చేరింది. దీని బట్టి.. బంగారం ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది అంటే 2026లోనూ పసిడి ధరలు మరింతగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
1950 నుంచి బంగారం ధరలు(10 గ్రాములు) ఇలా..
1950 – 10 గ్రాములు- 99 రూపాయలు
1955 – 10 గ్రాములు- 79 రూపాయలు
1960 – 10 గ్రాములు- 111 రూపాయలు
1965 – 10 గ్రాములు- 72 రూపాయలు
1970 – 10 గ్రాములు- 184 రూపాయలు
1975 – 10 గ్రాములు- 540 రూపాయలు
1980 – 10 గ్రాములు- 1330 రూపాయలు
1985 – 10 గ్రాములు- 2130 రూపాయలు
1990 – 10 గ్రాములు- 3200 రూపాయలు
1995 – 10 గ్రాములు- 4680 రూపాయలు
2000 – 10 గ్రాములు- 4400 రూపాయలు
2005 – 10 గ్రాములు- 7వేల రూపాయలు
2010 – 10 గ్రాములు- 18500 రూపాయలు
2015 – 10 గ్రాములు- 26343 రూపాయలు
2020 – 10 గ్రాములు- 48650 రూపాయలు
2021 – 10 గ్రాములు- 50045 రూపాయలు
2022 – 10 గ్రాములు- 52950 రూపాయలు
2023 – 10 గ్రాములు- 60300 రూపాయలు
2024 – 10 గ్రాములు- 79000 రూపాయలు
