India Vaccine Policy : ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇచ్చి ఉండకపోతే…వ్యాక్సిన్ ప్రక్రియపై దుష్ర్పచారం

కరోనా సెకండ్ వేవ్ కంటే..ముందే ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చి ఉండకపోతే..పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అత్యధిక శాతం ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం వల్లే..సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. రాజ్యాంగం ప్రకారం...ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.

India Vaccine Policy : ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇచ్చి ఉండకపోతే…వ్యాక్సిన్ ప్రక్రియపై దుష్ర్పచారం

India Vaccine Policy

PM Narendra Modi Speech : కరోనా సెకండ్ వేవ్ కంటే..ముందే ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చి ఉండకపోతే..పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అత్యధిక శాతం ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం వల్లే..సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. రాజ్యాంగం ప్రకారం…ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. 2021, జూన్ 07వ తేదీ సోమవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్ వచ్చిన విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియను డీసెంట్రలైజ్ చేయాలని చాలా రాష్ట్రాలు కోరాయి. కొన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వయస్సుల నిర్ధారణపై అనేక విమర్శలు చేశాయన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఎందుకు ఇచ్చారని కొందరు ప్రశ్నించారని, కేవలం కొన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్ ఎందుకు ఇచ్చారనే విమర్శలు వచ్చాయన్నారు. మీడియాలో ఓ వర్గం వ్యాక్సిన్ ప్రక్రియపై దుష్ర్పచారం చేసిందని విమర్శించారు. మరోవైపు..వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. వంద శాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు రాష్ట్రాల చేతుల్లో ఉన్న 25 శాతం బాధ్యత కూడా కేంద్రం తీసుకుంటుందన్నారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రమే వ్యాక్సిన్ వేయిస్తుందని, వ్యాక్సిన్ పై రాష్ట్రాలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 75 శాతం వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు ఇస్తుందని వెల్లడించారు. 25 శాతం వ్యాక్సినేషన్ ను ప్రైవేటు ఆసుపత్రులు చేసుకోవచ్చని సూచించారు. కోవిడ్ తో పోరాడుతూ..పటిష్టమైన వైద్య వ్యవస్థను రూపొందించుకున్నామన్నారు పీఎం మోడీ.

Read More : Indian Vaccination : 100 శాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రానిదే : మోడీ