Rahul Gandhi Video: రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి చేదు అనుభవం

ఐదేళ్ల క్రితం వరకు గాంధీ కుటుంబానికి అమేథీ పెట్టని కోటగా ఉంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీ సీటును..

Rahul Gandhi Video: రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి చేదు అనుభవం

Rahul Gandhi

Updated On : May 3, 2024 / 4:37 PM IST

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి ఇవాళ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందుకోసం ఆయన రాయ్‌బరేలీకి వచ్చిన వేళ బీజేపీ కార్యకర్తలు ‘రాహుల్ గాంధీ వెనక్కి వెళ్లిపో’ అంటూ నినాదాలు చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలోనూ ఆయనకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.

కాగా, గత ఎన్నికల్లో అమేథీలో పోటీ చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఆ నియోజక వర్గంలో పోటీ చేయకుండా రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ‘భయపడకు’ అని పదే పదే చెప్పే తన సొంత నినాదాన్ని మరచిపోయి అమేథీ నుంచి పారిపోయారని అన్నారు.

దీంతో భయపడకు అనే ఆయన నినాదం ద్వంద్వ ప్రమాణాలతో కూడి ఉందని యావత్ దేశం నిర్ధారణ చేసుకుందని చెప్పారు. యుద్ధభూమిని విడిచిపెట్టిన నేతగా, సైనికులను విడిచిపెట్టిన నాయకుడిగా దొడ్డిదారిన తప్పించుకున్న జనరల్‌గా రాహుల్ గాంధీ గుర్తుండిపోతారని చెప్పారు.

ఐదేళ్ల క్రితం వరకు గాంధీ కుటుంబానికి అమేథీ పెట్టని కోటగా ఉంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీ సీటును.. 2019లో బీజేపీ వేవ్‌లో కోల్పోయింది హస్తం పార్టీ. గత ఎన్నికల్లో స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు రాహుల్ గాంధీ. ఈ సారి ఎలాగైనా అమేథీ సీటును నిలబెట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. రాహుల్ గాంధీనే మళ్లీ పోటీ చేస్తారని టాక్ వినిపించింది. కానీ అనూహ్యంగా గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడైన కిశోరిలాల్ శర్మను బరిలోకి దించింది కాంగ్రెస్‌. దాంతో 25 తర్వాత తొలిసారి గాంధీ కుటుంబయేతర వ్యక్తి ఇక్కడ పోటీకి దిగారు.

Also Read: రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ నామినేషన్ దాఖలు.. కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి రోడ్ షో