BF shocked of GF habit: ప్రియురాలు చేస్తున్న పని సీక్రెట్‭గా చూసి బిత్తరపోయిన ప్రియుడు

ఒక రోజు రాత్రి నేను నిద్ర లేచే సమయానికి ఆమె సాక్స్ నములుతూ కనిపించింది. మొద్దు నిద్రలో ఉన్న నాకు దెబ్బకు నిద్ర మత్తు వదలిపోయింది. ఆ సాక్స్‌ని ఆమె ముందు రోజు ధరించినట్టు నాకు వెంటనే గుర్తొచ్చింది. నేను నిద్ర లేవడం గమనించి ఆమె నోట్లోని సాక్స్‭ని పారేసింది. కొన్ని వారాల తర్వాత ఈ విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించగా సమర్థించుకునేందుకు ప్రయత్నించింది. గట్టిగా అడిగితే కోపం తెచ్చుకుని అలిగేది.

BF shocked of GF habit: ప్రియురాలు చేస్తున్న పని సీక్రెట్‭గా చూసి బిత్తరపోయిన ప్రియుడు

man discovers his girlfriend has been secretly chewing socks

Updated On : August 16, 2022 / 11:25 PM IST

BF shocked of GF habit: చిన్న పిల్లలు బలపాలూ, చాక్‌పీస్‌లూ, సుద్దముక్కల వంటివి తింటుండడం చూస్తేనే ఉంటాం. కాస్త పెద్దవాళ్లు కూడా బలపాలు తినడం మామూలే. అయితే ఓ యువతికి ఉన్న అలవాటు గురించి చెప్తే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుందేమో. ఎందుకంటే ఆమకు చిన్నప్పటి నుంచి సాక్స్ నమిలే అలవాటు ఉందట. సాక్స్ వాసన అంటేనే చాలా మందికి పడదు. అలాంటిది సాక్స్‌ను ఏకంగా నోట్లు పెట్టుకుని నమలడం.. తలుచుకుంటేనే చాలా ఇబ్బందిగా ఉంది కదా. పాపం ఆ యువతికి చిన్నప్పటి నుంచి ఉన్న ఆ అలవాటు అలాగే కొనసాగుతోంది. పెద్దయ్యాక తన అలవాటు ఎవరి కంటా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇలా దాస్తు దాస్తూ ఎవరికి దొరక్కూడదో వారికే దొరికింది. అదే తన బాయ్‌ఫ్రెండ్‌కు దొరికిపోయింది. ఒక్కసారిగా ఖంగు తిన్న ఆ అతడు విషయాన్ని నెటిజెన్ల ముందు ఉంచాడు.

తన అనుభవాన్ని నెటిజెన్లతో పంచుకుంటూ.. ‘‘ఒక రోజు రాత్రి నేను నిద్ర లేచే సమయానికి ఆమె సాక్స్ నములుతూ కనిపించింది. మొద్దు నిద్రలో ఉన్న నాకు దెబ్బకు నిద్ర మత్తు వదలిపోయింది. ఆ సాక్స్‌ని ఆమె ముందు రోజు ధరించినట్టు నాకు వెంటనే గుర్తొచ్చింది. నేను నిద్ర లేవడం గమనించి ఆమె నోట్లోని సాక్స్‭ని పారేసింది. కొన్ని వారాల తర్వాత ఈ విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించగా సమర్థించుకునేందుకు ప్రయత్నించింది. గట్టిగా అడిగితే కోపం తెచ్చుకుని అలిగేది. `నేను నీకు ముద్దు పెడితే.. నీ నోట్లో ఏమి ఉంటుందో నాకు తెలుసు` అని ఆమెతో అంటే తను వెంటనే అప్‌సెట్ అయి మరో గదిలోకి వెళ్లిపోయింది. ఆమె అలా ఎందుకు చేస్తోందో, తన అలవాటు గురించి ఎందుకు దాచాలని ప్రయత్నిస్తుందో తెలియడం లేదు’’ అని నెటిజెన్లతో అతడు షేర్ చేసుకున్నాడు.

దీనికి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆమెపై జాలి చూపుతూ, ప్రేమగా ప్రవర్తిస్తూ తెలుసుకోవడానికి ప్రయత్నించు అని చాలా మంది సలహా ఇచ్చారు. ఆమె సమస్య గురించి తెలుసుకునే అవసరం నీకు ఉందని, అవసరమైతే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని కొందరు చెప్పారు.

Viral Video: కస్టమర్లను ఐకియా స్టోర్‌లోనే బంధించడానికి అధికారుల యత్నం.. తోసుకుని బయటకు వెళ్ళిన వినియోగదారులు