మరోసారి పల్లె పోరు : 259 గ్రామాల్లో ఎన్నికలు

తెలంగాణలోని కొన్ని పల్లెల్లో మరోసారి ఎన్నికల సందడి మొదలవుతోంది. పలు కారణాలతో ఎన్నికలు జరగని చోట ఫిబ్రవరి 28న ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ కూడా

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 03:11 PM IST
మరోసారి పల్లె పోరు : 259 గ్రామాల్లో ఎన్నికలు

తెలంగాణలోని కొన్ని పల్లెల్లో మరోసారి ఎన్నికల సందడి మొదలవుతోంది. పలు కారణాలతో ఎన్నికలు జరగని చోట ఫిబ్రవరి 28న ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ కూడా

తెలంగాణలోని కొన్ని పల్లెల్లో మరోసారి ఎన్నికల సందడి మొదలవుతోంది. పలు కారణాలతో ఎన్నికలు జరగని చోట ఫిబ్రవరి 28న ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ కూడా విడుదలవడంతో ఆయా గ్రామాల్లో హడావుడి మొదలైంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలు కారణాలతో వాయిదా పడిన 259 పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 6 గ్రామాల్లో కేవలం సర్పంచ్ పదవులకు, 7 గ్రామాల్లో సర్పంచ్, వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా… 246 గ్రామాల్లో కేవలం వార్డు పదవులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నారాయణరావుపేట ఎస్సీ కాలనీ, సంగెం… జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్… కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వెంకటాపూర్.. మహబూబ్‌నగర్ జిల్లాలోని కానుకుర్తి, గుర్జాల గ్రామాల్లో కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే ఎన్నికలు జరగనుండగా… జనగాం జిల్లాలోని శివునిపల్లి… మంచిర్యాల జిల్లాలోని నెల్కి వెంకటాపూర్, వందూరుగూడ, నిజామాబాద్ జిల్లాలోని గంగారం తండా, తిర్మన్‌పల్లి…. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గొల్లపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొయ్యలగూడెం పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి.

 

* ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ
* 17న స్క్రూటినీ
* 18న నామినేషన్లపై అభ్యంతరాల స్వీకరణ
* 20వ తేదీ మధ్యాహ్నం 3గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
* 28న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్
* మ 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
* ఫిబ్రవరి 18న  560 గ్రామాల్లో ఉపసర్పంచ్‌ల ఎన్నిక