Rahul Gandhi: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ డుమ్మా!

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను కూడా పూర్తిగా పార్టీకే అప్పగించారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్‭లో పర్యటించిన రాహుల్.. ఎన్నికల హామీలు ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతమైతే ఎన్నికల ప్రచారానికి వచ్చేలా లేరు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లో పెంచగలిగితే కాంగ్రెస్ లాభపడుతుంది. అయనప్పటికీ రాహుల్ అంతగా ఆసక్తి చూపడం లేదు

Rahul Gandhi: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ డుమ్మా!

Rahul Gandhi skips gujarat and himachal assembly elections

Rahul Gandhi: మరో నెల రోజుల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాగా, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. పార్టీలో కీలక నేత అయిన రాహుల్ గాంధీ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనెలా కనిపించడం లేదు.

కొద్ది రోజుల క్రితం ఆయన గుజరాత్ వచ్చినప్పటికీ.. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో బిజీ బిజీగా ఉన్నారు. 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర.. ఎన్నికలు జరిగే రెండు రాష్ట్రాల్లో లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు కూడా దూరంగా ఉంటూ యాత్ర చేస్తున్న రాహుల్.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా దూరంగా ఉండబోతున్నట్లే కనిపిస్తోంది. కొంత కాలంగా సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక అయినా ముందుండి ప్రచారం నిర్వహించిన రాహుల్.. ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలను పక్కన పెడుతుండడం గమనార్హం.

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం.. పార్టీలో ఎవరూ తనకు సహకరించలేదని, అందరూ తమ వారసులకు టికెట్లు సంపాదించడంలో బిజీ అయ్యారని, పార్టీ గెలుపును ఎవరూ పట్టించుకోలేదని ఆ ఎన్నికలు ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకు రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీ ముట్టనట్టే ఉంటున్నారు. తాను కాస్త దూరంగా ఉందామని ప్రయత్నించినప్పటికీ.. పార్టీ నేతల ఒత్తిడి ఆయనపై పెరిగింది. అయినప్పటికీ రాహుల్ పార్టీలో పెద్దగా జోక్యం చేసుకోకుండా వచ్చారు.

EC: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోవడానికి గల కారణాలు వెల్లడించిన ఈసీ

ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను కూడా పూర్తిగా పార్టీకే అప్పగించారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్‭లో పర్యటించిన రాహుల్.. ఎన్నికల హామీలు ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతమైతే ఎన్నికల ప్రచారానికి వచ్చేలా లేరు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లో పెంచగలిగితే కాంగ్రెస్ లాభపడుతుంది. అయనప్పటికీ రాహుల్ అంతగా ఆసక్తి చూపడం లేదు. ఆయన పూర్తిగా భారత్ జోడో యాత్రలో మమేకం అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా యాత్ర చేస్తున్నారు. అప్పటి వరకు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకోనని రాహుల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ కార్యకలాపాలతో సంబంధం లేకుండా.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ (శ్రీనగర్) వరకు భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. మొదటగా 13 రాష్ట్రాల్లో 3,570 కిలో మీటర్లు ప్రయాణించాలని రూట్ మ్యాప్ గీసుకుని యాత్ర ప్రారంభించారు. సెప్టెంబర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఈ యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది.

Himachal Assembly Polls: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రియాంక గాంధీ