Parkash Singh Badal: సర్పంచ్ నుంచి ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రి వరకు.. అకాలీ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్ రాజకీయ జర్నీ

పంజాబ్ రాజకీయాల్లోనే కాకుండా, సిక్కు మతపరమైన వ్యవహారాల్లో సుదీర్ఘ కాలం ఆధిపత్యం చెలాయించారు. 2015లో మోదీ ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత గౌరవ పురస్కారమై పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా డిసెంబర్ 3, 2020న ఆ అవార్డును తిరిగి ఇచ్చేశారు.

Parkash Singh Badal: సర్పంచ్ నుంచి ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రి వరకు.. అకాలీ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్ రాజకీయ జర్నీ

Parkash Singh Badal

Parkash Singh Badal: సర్పంచ్ స్థాయి నుంచి ఏకంగా ఐదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 70 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో ఉన్నారు. శిరోమణి అకాలీ దళ్ పార్టీలో ఒక మామూలు నాయకుడి నుంచి పార్టీ అధినేత వరకు ఎదిగారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నాటి నుంచి మొదలైన ఆయన రాజకీయ జీవితం.. తాజాగా కన్ను మూసే వరకు కొనసాగింది. ఆయనే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్. పంజాబ్ రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నేతల్లో ప్రకాశ్ సింగ్ బాదల్ ఒకరని చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన మొహాలీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ 95వ ఏట కన్ను మూశారు.

ప్రకాశ్ సింగ్ బాదల్ రాజకీయ జీవితం
డిసెంబర్ 8, 1927లో ప్రకాశ్ సింగ్ బాదల్ జన్మించారు. అనంతరం.. బ్రిటిషర్ల నుంచి ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన అనంతరమే బాదల్ గ్రామానికి సర్పంచ్‭గా ఎన్నికయ్యారు. అనంతరం ఒక్కో మెట్టు పైకి ఎగబాకుతూ ముఖ్యమంత్రి వరకు వెళ్లారు. 1970లో మొట్టమొదటి సారి ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో జనతా పార్టీతో శిరోమణి పొత్తు పెట్టుకుంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా 1970-1971, 1977-1980, 1997-2002, 2007-2017 మధ్య ఐదుసార్లు పనిచేశారు. అప్పట్లో దేశంలోనే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా నిలిచారు. శిరోమణి అకాలీదల్ పార్టీకి 1995 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు.

Karnataka Polls: గంట లేటయిందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‭ను బాయ్‭కాట్ చేసిన మీడియా

1957లో శిరోమణి అకాలీ దళ్ పార్టీ నుంచి మొదటిసారి పంజాబ్ అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అనంతరం 1969లో మళ్లీ గెలిచారు. 1972, 1980, 2002 ల్లో ఆయన పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మొత్తంగా పదిసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పంజాబ్ రాజకీయాల్లోనే కాకుండా, సిక్కు మతపరమైన వ్యవహారాల్లో సుదీర్ఘ కాలం ఆధిపత్యం చెలాయించారు. ఏడు దశాబ్దాల ఆయన ప్రజా సేవకు గాను 2015లో మోదీ ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత గౌరవ పురస్కారమై పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా డిసెంబర్ 3, 2020న ఆ అవార్డును తిరిగి ఇచ్చేశారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బాదల్ చివరిసారిగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత గుర్మీత్ సింగ్ ఖుడియన్ చేతిలో ఓడిపోయారు.