Rishabh Pant: సచిన్‌లా పంత్‌ను కూడా ఓపెనర్ చేస్తే..

టీమిండియా యువ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఓపెనర్ గా మార్చాలంటున్నాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. పంత్ ను సచిన్ తో పోల్చిన బంగర్.. అలా చేసిన తర్వాతే టెండూల్కర్ బాగా రాణించాడని, అద్భుత ఫలితాలు నమోదు చేశాడని పేర్కొన్నాడు.

Rishabh Pant: సచిన్‌లా పంత్‌ను కూడా ఓపెనర్ చేస్తే..

Rishab Sachin

Rishabh Pant: టీమిండియా యువ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఓపెనర్ గా మార్చాలంటున్నాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. పంత్ ను సచిన్ తో పోల్చిన బంగర్.. అలా చేసిన తర్వాతే టెండూల్కర్ బాగా రాణించాడని, అద్భుత ఫలితాలు నమోదు చేశాడని పేర్కొన్నాడు.

“న్యూజిలాండ్ పర్యటనలో ఓపెనర్ గా మార్చిన తర్వాతే సచిన్ ఆట తీరులో మార్పు వచ్చింది. 75 లేదా 76వ ఇన్నింగ్స్ లోనే సచిన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. పంత్ ను కూడా ఓపెనర్ గా చేస్తారని మూడేళ్లుగ ఎదురుచూస్తున్నా” అని వెల్లడించాడు.

ప్రస్తుతానికి టీ20ల్లో ఓపెనర్ గా ఇషాన్ కిషన్ బాగానే రాణిస్తున్నాడని, కానీ, భవిష్యత్ రీత్యా ఆలోచిస్తే పంత్ ను తీసుకోవాలని సూచిస్తున్నాడు. అలా తీసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. బంగర్ వ్యాఖ్యలకు టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం మద్దతిచ్చాడు. పంత్ ఓపెనర్ అయితే పవర్ ప్లేలో బౌలర్లపై ఎదురుదాడి ఉంటుందని పేర్కొన్నాడు.

Read Also : రాహుల్ స్థానంలో మయాంక్‌‌.. వైస్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌..!

నిజానికి లోయర్ ఆర్డర్ లో దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలు మెరిసిపోతుంటే, పంత్ మాత్రం విరాట్, సూర్యకుమార్ ల లోటు తీర్చడానికి నెం.4లో నలిగిపోతున్నాడు. ఒక్కసారి ఓపెనర్ అయితే ఆస్ట్రేలియాకు ఆడమ్ గిల్ క్రిస్ట్ లా పంత్ మెరుస్తాడని అంటున్నాడు బంగర్.