U19 World Cup 2022: తరాలు మారినా తిరుగులేనిది U19 టీమిండియా చరిత్ర… కైఫ్ నుంచి యశ్ వరకూ

అండర్-19 టీమిండియా తిరుగులేని చరిత్ర లిఖించింది. ఎనిమిదో సారి ఫైనల్ కు చేరిన అండర్-19 కుర్రాల్లు ఐదోసారి ట్రోఫీని తీసుకొచ్చారు. యష్ ధుల్ సారథ్యంలో రికార్డు సృష్టించారు.

U19 World Cup 2022: తరాలు మారినా తిరుగులేనిది U19 టీమిండియా చరిత్ర… కైఫ్ నుంచి యశ్ వరకూ

Undr 19 Captains

U19 World Cup: అండర్-19 టీమిండియా తిరుగులేని చరిత్ర లిఖించింది. ఎనిమిదో సారి ఫైనల్ కు చేరిన అండర్-19 కుర్రాల్లు ఐదోసారి ట్రోఫీని తీసుకొచ్చారు. యష్ ధుల్ సారథ్యంలో రికార్డు సృష్టించారు. యువ జట్టు ఇండియాకు ట్రోఫీ అందించడం మొహమ్మద్ కైఫ్ నుంచి మొదలైంది.

మొహమ్మద్ కైఫ్: 2000
అండర్-19 వరల్డ్ కప్స్ తొలి రెండు ఎడిషన్లను 6వ స్థానం, 5వ స్థానంలో ముగించిన టీమిండియా తొలిసారి U19 వరల్డ్ కప్ ను ముద్దాడింది. కొలంబో వేదికగా జరిగి మ్యాచ్ లో లంకను 6వికెట్ల తేడాతో ఓడించింది. 179పరుగుల లక్ష్యాన్ని 56 బంతులు మిగిలి ఉండగానే చేధించిందింది కైఫ్ సేన.

విరాట్ కోహ్లీ: 2008
సఫారీలపై తిరుగులేని సవారీ చేసింది కోహ్లీ సేన. విరాట్ కోహ్లీ సారథ్యంలో దక్షిణాఫ్రికాను కౌలా లంపూర్ వేదికగా చిత్తు చేసింది. 159పరుగులు చేసిన విరాట్ జట్టు ప్రత్యర్థి జట్టును 8వికెట్ల నష్టానికి 103పరుగులకే కట్టడి చేసింది. డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం విజయం టీమిండియాకే దక్కింది.

ఉన్ముక్త్ చంద్: 2012
ఆస్ట్రేలియా జట్టుపై క్వీన్స్ లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థిని 6వికెట్ల తేడాతో ఓడించింది భారత్. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కీలకంగా వ్యవహరించి 111పరుగుుల నమోదుచేశాడు.

పృథ్వీ షా: 2018
న్యూజిలాండ్ వేదికగా జరిగిన సమరంలో టీమిండియా నాలుగో టైటిల్ సొంతం చేసుకుంది. మరోసారి ఆస్ట్రేలియాను ఓడించి 8వికెట్ల తేడాతో గెలిచింది. మన్జోత్ కల్రా బీభత్సం సృష్టించి 101 పరుగులు నమోదు చేశాడు.

యశ్ ధుల్: 2022
ఐదో సారి వరల్డ్ క్లాస్ టీంగా నిలిచింది ఇండియన్ అండర్-19 టీం. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ను 189 పరుగులకే కట్టడి చేసింది. చేధన దిశగా పోరాడిన టీమిండియా 14 బంతులు మిగిలిఉండగానే విజయాన్ని ముద్దాడింది. సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా టీమిండియా అండర్-19 ఆనందంలో మునిగిపోయింది.