Liam Livingstone: క్రికెట్ చరిత్రలోనే బిగ్ సిక్స్.. వీడియో!

పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సెకండ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పాకిస్తాన్ 43 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన తరువాత, ఇంగ్లండ్ ఆల్ అవుట్ అవ్వడానికి ముందు 19.5 ఓవర్లలో 200 పరుగులు చేసింది.

Liam Livingstone: క్రికెట్ చరిత్రలోనే బిగ్ సిక్స్.. వీడియో!

Livi

PAK vs ENG: పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సెకండ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పాకిస్తాన్ 43 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన తరువాత, ఇంగ్లండ్ ఆల్ అవుట్ అవ్వడానికి ముందు 19.5 ఓవర్లలో 200 పరుగులు చేసింది. సిరీస్ ఫస్ట్ టీ20 ఇంటర్నేషనల్‌లో సెంచరీ చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో కూడా అధ్భుతంగా బ్యాటింగ్ చేశాడు. లివింగ్‌స్టోన్ 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు.

ఈ సమయంలో మూడు అద్భుతమైన సిక్సర్లు కొట్టాడు. ఇందులో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ వేసిన ఓ బంతతికి స్టేడియం బయటకు కొట్టేశాడు. ఈ సిక్సర్ ఇప్పుడు సూపర్ సిక్స్, ప్రపంచంలోనే పెద్ద సిక్స్‌గా నమోదైంది. లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ 122 మీటర్ల కంటే పొడవైన అతి భారీ సిక్సర్‌ను కొట్టాడు. ఈ సిక్సర్‌ స్టేడియాన్ని దాటేసి పక్కనే ఉన్న రగ్బీ పిచ్‌పై పడింది. కనుచూపు మేరలో కనిపించకుండా పోయిన ఈ సిక్స్‌ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన భారీ సిక్సర్‌ అని అంటున్నారు.

ఇంగ్లాండ్ క్రికెట్ ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. బట్లర్, మొయిన్, లివింగ్‌స్టోన్ ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 200పరుగులు చెయ్యగా.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సిరీస్‌లో చెరొక విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.