Raj Angad Bawa: ఒకప్పుడు గోల్డ్ మెడల్ విన్నర్ మనువడే వరల్డ్ కప్ విన్నర్
టీమిండియా తన ఖాతాలో వేసుకున్న ఐదో వరల్డ్ కప్ టైటిల్ తో చరిత్ర లిఖించింది. ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారిపోతుందుకున్నా గెలిపించేశారు అండర్-19కుర్రాళ్లు.

Tarlochin Singh Bawa
Raj Angad Bawa: టీమిండియా తన ఖాతాలో వేసుకున్న ఐదో వరల్డ్ కప్ టైటిల్ తో చరిత్ర లిఖించింది. ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారిపోతుందుకున్నా గెలిపించేశారు అండర్-19కుర్రాళ్లు. ఇంగ్లీషు జట్టును 14 బంతులు ఉండగానే ఓడించేశారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి కేవలం 189 పరుగులకే కట్టడి చేశారు.
అందులో భాగంగానే రాజ్ అంగద్ బావా ఐదు వికెట్లు పడగొట్టి హీరో అయ్యాడు. అతనెవరో తెలుసా.. 1948 ఒలింపిక్ గేమ్స్ లో స్వర్ణం గెలిచిన ఇండియన్ హాకీ టీం ప్లేయర్ తర్లోచిన్ సింగ్ బావా మనువడు. గ్రేట్ బ్రిటన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేశాడు.
74ఏళ్ల తర్వాత అతని మనువడు దేశం కోసం హాకీ మైదానానికి బదులు క్రికెట్ గ్రౌండ్ లో హీరోయిజం చూపించాడు. టోర్నమెంట్ ఆసాంతం అత్యధిక పరుగులు సాధించిన రెండు ప్లేయర్ గా, అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్ గా నిలిచాడు.
Read Also: ప్రమోషన్స్ వివాదం.. బన్నీకి బ్రాండే బ్యాడా?
మొత్తం అండర్-19 వరల్డ్ కప్ లో 252 పరుగులు సాధించాడు. వికెట్లు తీసిన బౌలర్లలో విక్కీ ఒస్త్వాల్ (12), రవి కుమార్ (10)లు ముందున్నారు.
ఐదో సారి వరల్డ్ క్లాస్ టీంగా నిలిచింది ఇండియన్ అండర్-19 టీం. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ను 189 పరుగులకే కట్టడి చేసింది. చేధన దిశగా పోరాడిన టీమిండియా 14 బంతులు మిగిలిఉండగానే విజయాన్ని ముద్దాడింది. సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా టీమిండియా అండర్-19 ఆనందంలో మునిగిపోయింది.