Ranji Trophy: ఇన్నింగ్స్‌కో సెంచరీ బాది ఘనత నమోదు చేసిన యశ్ ధుల్

ఇండియా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ సీనియర్ క్రికెటర్ గా కెరీర్ మొదలుపెట్టడానికి ముందే రంజీ ట్రోఫీలో మెరుపులు కురిపిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో...

Ranji Trophy: ఇన్నింగ్స్‌కో సెంచరీ బాది ఘనత నమోదు చేసిన యశ్ ధుల్

Yash Dhull

Ranji Trophy: ఇండియా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ సీనియర్ క్రికెటర్ గా కెరీర్ మొదలుపెట్టడానికి ముందే రంజీ ట్రోఫీలో మెరుపులు కురిపిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు క్వాలిటీ బౌలింగ్ అటాక్ చేసింది.

ఈ మ్యాచ్ లో ఒక్కో ఇన్నింగ్స్ కు ఒక్కో సెంచరీ చొప్పున నమోదు చేశాడు. దీంతో నారీ కాంట్రాక్టర్ (గుజరాత్), విరాట్ స్వాతె (మహారాష్ట్ర)ల తర్వాత రంజీట్రోఫీ అరంగ్రేటంలోనే ఈ ఫీట్ సాధించిన మూడో ఇండియన్ క్రికెటర్ ఘనత సాధించాడు.

ఇండియన్ అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్.. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగి చెలరేగాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 113పరుగులతో అజేయంగా నిలిచాడు. ధుల్ తో పాటు ధ్రువ్ షోరే (107 నాటౌట్)తో 228పరుగులు నమోదు చేశాడు.

Read Also: రెండేళ్ల విరామం తర్వాత రంజీ ట్రోఫీ రీ ఎంట్రీ

అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభంలో కొవిడ్ టెస్టు చేయించుకుని పాజిటివ్ రావడంతోమరో ఐదుగురు టీమ్ మేట్స్ తో కలిసి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. తొలి మ్యాచ్ లో క్వార్టర్ ఫైనల్ లో 82 బంతులకు 100 స్కోరు చేసి బంగ్లాదేశ్ తో ఆడాడు. సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో అసమాన ప్రతిభ చూపాడు.