Rishabh Pant: ధోనీ.. సాహాలతో సమానంగా పంత్ ఘనత పట్టేశాడు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. దీంతో టీమిండియా మాజీ వికెట్ కీపర్, వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాల సరనన చేరాడు. వికెట్ కీపర్ గా క్యాచ్ అందుకుని 100వ...

Rishabh Pant: ధోనీ.. సాహాలతో సమానంగా పంత్ ఘనత పట్టేశాడు

Rishab Pant

Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. దీంతో టీమిండియా మాజీ వికెట్ కీపర్, వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాల సరనన చేరాడు. వికెట్ కీపర్ గా క్యాచ్ అందుకుని 100వ వికెట్ అవుట్ పడగొట్టడానికి కారణమయ్యాడు. లాంగ్ ఫార్మాట్ లో ఈ ఫీట్ సాధించిన వికెట్ కీపర్ గా నిలిచాడు.

టెస్టుల్లో 100 క్యాచ్‌లు తీసుకున్న పంత్‌ ధోని, సాహా సరసన నిలిచాడు. పంత్‌కు 100 క్యాచ్‌లు అందుకోవడానికి కేవలం 26 టెస్టులు మాత్రమే అవసరం కాగా, ధోనీ, సాహాలు సమానంగా 36 టెస్టుల్లో 100 క్యాచ్‌ల మార్క్‌ను అందుకున్నారు.

ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా తరపున ఎంఎస్‌ ధోనీ 294 క్యాచ్‌లతో మొదటిస్థానంలో.. సయ్యద్‌ కిర్మాణి(198 డిస్‌మిసల్స్‌), కిరణ్‌ మోరే(130 డిస్‌మిసల్స్‌), నయన్‌ మోంగియా(107 డిస్‌మిసల్స్‌), వృద్ధిమాన్‌ సాహా(104 డిస్‌మిసల్స్‌) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నారు.

ఇది కూడా చదవండి : గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర

సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను 197 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ చెలరేగాడు. 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాకు దడ పుట్టించాడు.