Serena Williams: టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్

సెరెనా విలియమ్స్ మంగళవారం టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్ కు దూరంగా ఉంటానని తెలిపారు. తనకు ముఖ్యమైన మరొకొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. "నాకు రిటైర్మెంట్ అనే పదమే నచ్చదు. ఇది కేవలం ఒక మార్పు కావాలి. కానీ, ఇప్పుడు ఆ పదాన్ని నేనెలా వాడతాననేదే ముఖ్యం" అని విలియమ్స్ వోగ్ లో రాసుకొచ్చారు.

Serena Williams: టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్
ad

 

 

Serena Williams: సెరెనా విలియమ్స్ మంగళవారం టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్ కు దూరంగా ఉంటానని తెలిపారు. తనకు ముఖ్యమైన మరొకొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. “నాకు రిటైర్మెంట్ అనే పదమే నచ్చదు. ఇది కేవలం ఒక మార్పు కావాలి. కానీ, ఇప్పుడు ఆ పదాన్ని నేనెలా వాడతాననేదే ముఖ్యం” అని విలియమ్స్ వోగ్ లో రాసుకొచ్చారు.

ఈ వార్త విన్నప్పటి నుంచి ట్విట్టర్ లో తమ బాధనంతా వెళ్లగక్కుతున్నారు నెటిజన్లు. “సెరెనా నా జీవితానికి అథ్లెట్. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. సమయంతో పాటు ఎవరి కెరీర్ అయినా కనుమరుగవ్వాల్సిందే. కోకో, నవోమీ, వీనస్ అందరూ బాగా ఆడతారని ఆశిస్తున్నా” అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇంకొక నెటిజన్.. “నేనెందుకు ఎమోషనల్ కావాలి. సెరెనా, వీనస్ లు నా ఎదుగుదలకు చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నారు. సెరెనా విలియమ్సన్ వేగాన్ని దేవుడు పెంచేశాడు” అని కామెంట్ చేశారు.

Read Also : కల చెదిరింది…కన్నీరు పెట్టుకున్న సెరెనా

సెరెనా విలియమ్స్ 319 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగారు. 186వారాలు జాయింట్ రికార్డ్ తో కూడా ఉన్నారు. ఐదు సార్లు సంవత్సారంతం నెంబర్ వన్ గా నిలిచారు. సెరెనా 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలవగా.. అంతకంటే ముందు మార్గరెట్ కోర్ట్స్ 24 టైటిల్స్ తో ముందున్నారు.