Wimbledon : కల చెదిరింది…కన్నీరు పెట్టుకున్న సెరెనా

అమెరికా టెన్నిస్ లో తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సెరెనా విలియమ్స్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అభిమానుల సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే..ఎంతగానో కన్న కలలు చెదిరిపోయాయి. ఆ కల నెరవేరాలంటే..మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికి కారణం..‘గాయం’. అవును గాయం కారణంగా..వింబుల్డన్ నుంచి తొలి రౌండ్ లోనే నిష్క్రమించాల్సి వచ్చింది.

Wimbledon : కల చెదిరింది…కన్నీరు పెట్టుకున్న సెరెనా

Serena

Tearful Serena Williams : అమెరికా టెన్నిస్ లో తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సెరెనా విలియమ్స్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అభిమానుల సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకంటే..ఎంతగానో కన్న కలలు చెదిరిపోయాయి. ఆ కల నెరవేరాలంటే..మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికి కారణం..‘గాయం’. అవును గాయం కారణంగా..వింబుల్డన్ నుంచి తొలి రౌండ్ లోనే నిష్క్రమించాల్సి వచ్చింది.

తనకు ఎంతగానో అచ్చొచ్చిన వింబుల్డన్ పై సెరెనా విలియమ్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంగళవారం ఆమె సెంటర్ కోర్టులో అలియక్ సాండ్రా ససనోవిచ్ తో తలపడ్డారు. ఐదో గేమ్ లో సర్వీసు చేస్తున్న సెరెనా..అకస్మాత్తుగా బేస్ లైన్ వద్ద కాలు బెణికింది. నొప్పితో విలవిలాడారు. ఆ గేమ్ ముగియగానే..మెడికల్ టైమ్ తీసుకుని మరలా ఆటను కొనసాగించారు. నొప్పి తట్టుకోలేక..పెదవులను బిగపట్టి..కన్నీరు పెట్టుకున్నారు.

ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని..బాధతో అల్లడిపోయారు. ఈ సమయంలో అభిమానులు ఆమెను ఎంతగానో ప్రోత్సాహించారు. సెరెనా..సెరెనా..అంటూ అరుపులతో ప్రోత్సాహించారు. అయితే..నొప్పి కారణంగా..ఆటను కొనసాగించలేకపోయారు. మోకాళ్లపై మైదానంలో కూలబడిపోయారు. ఛైర్ అంపెర్ ఆమె దగ్గరకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఆటను కొనసాగించడం కష్టతరం కావడంతో…మ్యాచ్ నుంచి తప్పుకోవాలని సెరెనా నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యర్థితో చేయి కలిపిన..ఆమె…అభిమానులను వందనం చేస్తూ..వెళ్లిపోయారు.

సెరెనా విషయానికి వస్తే…ఆమె కెరీర్ లో ఒక గ్రాండ్ స్లామ్ తొలి రౌండ్ లోనే తప్పుకోవడం రెండోసారి. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో ఏడుసార్లు ఛాంపియన్ గా నిలిచారు. 2016లోనూ గెలిచారు. పోటీ చేసిన చివరి రెండు సార్లు (2018, 2019) ఆమె వింబుల్డన్ లో రన్నరప్ గా నిలిచారు. ఇప్పటి వరకు 23 వరకు గ్రాండ్ స్లామ్ లు గెలుచుకున్నారు. మార్గరెట్ కోర్ట్ సాధించిన 24 గ్రాండ్ స్లామ్ ల రికార్డును అధిగమించాలని సెరెనా భావించారు. కానీ గాయం కారణంగా..తప్పుకున్నారు.