Home » 10tv
ముఖ్యంగా ప్రస్తుతం మొక్కజొన్నను పీడిస్తున్న సమస్య కత్తెరపురుగు. పంట వేసిన మొదలు కోత కోసే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
పశువు రోజువారీ ఆహార అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మాంసకృత్తులను, అధిక శక్తిని అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం అధిక పోషక విలువలు కలిగిన దినుసులను తగు పాళ్లలో కలిపి మర పట్టించాలి.
రాగులు.. బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు.. నేడు అనేక ఆరోగ్యసమస్యల వల్ల, తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఖరీఫ్ కందిని విత్తే సమయం జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. ఏకపంటగా వేస్తే ఎకరాకు 6 నుండి 7 కిలోల విత్తనం, అంతర పంటగా వేస్తే 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది.
మొలకెత్తిన విత్తనాలను డ్రమ్ సీడర్ లేదా నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో ఎకరాకి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది.
ఖర్జూరం, శ్రీగంధంతో పాటు మామిడి, మునగ మొక్కలతో మిశ్రమ పంటలసాగుచేస్తున్న రైతు..3 ఏళ్ల క్రితం 7 వేల వాటర్ ఆపిల్ మొక్కలను నాటారు. గత ఏడాది నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడో పంట దిగుబడిని పొందుతున్నారు.
రైతుల వద్ద కూరగాయలు ఉన్న విషయం తెలిసిన చేపల చెరువుల నిర్వాహకులు గుమ్మడికాయలను వారే కోత కోయించి చెరువుల వద్దకు తెచ్చి ప్రతిరోజు చేపలకు అహారంగా పెడుతున్నారు
గృహమే స్వర్గసీమ అంటున్నారు ఆధునిక కాలంలో పలువురు. అలా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందంటూ ఆచరించి చూపించి.. ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి నుంచి వచ్చిన మానవుడు.. మొక్కల నడుమన ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా వుండటం వల్ల రైతులకు అన్నివిధాలుగా పత్తి సాగు అనుకూలంగా వుండటంతో ఈ ఏడాది ఏకంగా 52 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేశారు.
పైపాటుగా ఎరువులను వేసిన తరువాత తప్పనిసరిగా ఒక నీటితడిని ఇచ్చినట్లయితే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 10కిలోలు వేసుకున్నట్లయితే గింజల్లో నూనెశాతం పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు.