Kandi Crop Cultivation : పెరిగిన కంది సాగు విస్తీర్ణం.. అధిక దిగుబడి కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు

ఖరీఫ్ కందిని విత్తే సమయం జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. ఏకపంటగా వేస్తే ఎకరాకు 6 నుండి 7 కిలోల విత్తనం, అంతర పంటగా వేస్తే 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది.

Kandi Crop Cultivation : పెరిగిన కంది సాగు విస్తీర్ణం.. అధిక దిగుబడి కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు

Kandi Crop

Updated On : August 12, 2023 / 6:59 AM IST

Kandi Crop Cultivation : వర్షాధార పంటగా కందిని ఇప్పటికే చాలా చోట్ల రైతులు విత్తారు. మరీ ఆలస్యమైన ప్రాంతాల్లో ఆగస్టు వరకు విత్తుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఖరీఫ్ కందిలో అధిక దిగుబడులను సాధించాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులను ఆచరించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా , కొండెంపూడి  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Vegetable Cultivation : కూరగాయ నారుమడిలో తెగుళ్ల ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు

తెలుగు రాష్ర్టాలలో సాగవుతున్న పప్పుదినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది.. తెలంగాణా ప్రాంతంలో సుమారుగా 2.86 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల 80 వేల ఎకరాల్లో కందిని సాగవుతుంది. ఏకపంటగానే కాక పలు పంటల్లో అంతరపంటగా కూడా సాగుచేసుకునే అవకాశం వుంది. 1 లక్షా 38 వేల టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉంది.

READ ALSO : Eggplant Gardens : వంగలో ఎర్రనల్లి ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఖరీఫ్ కందిని విత్తే సమయం జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. ఏకపంటగా వేస్తే ఎకరాకు 6 నుండి 7 కిలోల విత్తనం, అంతర పంటగా వేస్తే 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది. కంది సాగుకు మురుగునీరు బయటికి పోని నేలలు, చౌడు నేలలు తప్పా, అన్ని రకాల నేలలు అనుకూలం. మరి సాగులో అధిక దిగుబడులు పొందాలంటే సమగ్ర యాజమాన్యం తప్పకుడా పాటించాలంటూ సూచిస్తున్నారు  విశాఖ జిల్లా , కొండెంపూడి  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి. ఉమామహేశ్వరరావు

READ ALSO : BJP Leader Killed : బీజేపీ నేత దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపారు, షాకింగ్ వీడియో

కాయలు ఎండిన తరువాతే కంది పంటను కోయాలి. ఎందుకంటే పూత 2 నెలల వరకు పూస్తూనే ఉంటుంది. ఎండిన తరువాత కట్టెతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చేయాలి. కందులను నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండాలంటే బాటా ఎండ బెట్టాలి. దాంతో పాటు బూడిద కలిపిగాని, వేప ఆకులు కలిపిగాని నిల్వ చేయాలి.