Vegetable Cultivation : కూరగాయ నారుమడిలో తెగుళ్ల ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు

చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతుండగా.. కొందరు నర్సరీల్లో ప్రోట్రేల విధానంలో పెంచే నారుపై ఆదారపడి కూరగాయల సాగు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సంప్రదాయ పద్ధతిలో పెంచే నారులో తెగుళ్ల బెడద ఉధృతి అధికమైంది.

Vegetable Cultivation : కూరగాయ నారుమడిలో తెగుళ్ల ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు

Vegetable Cultivation

Vegetable Cultivation : కొన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలను నారుపెంచి నాటాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి టమాటో, మిరప, వంగ, బంతి. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా నారుకుళ్లు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు నారుమడిలో కొద్దిపాటి యాజమాన్యం చేపడితే నాణ్యమైన నారును అందిపుచ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు.

READ ALSO : Eggplant Gardens : వంగలో ఎర్రనల్లి ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు నూటికి 90శాతంమంది  రైతులు హైబ్రిడ్‌ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.  కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి.

READ ALSO : Rahul Gandhi : వయానాడ్ పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ

చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతుండగా.. కొందరు నర్సరీల్లో ప్రోట్రేల విధానంలో పెంచే నారుపై ఆదారపడి కూరగాయల సాగు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సంప్రదాయ పద్ధతిలో పెంచే నారులో తెగుళ్ల బెడద ఉధృతి అధికమైంది. కొత్తగా నారుమడులు పెంచే రైతులు .. ఇప్పటికే నారుపోసుకున్న రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం,  శాస్త్రవేత్త డా. యు . శ్రవంతి