Water Apple Farming : మిశ్రమ ఉద్యాన పంటగా వాటర్ యాపిల్ సాగు..పెట్టుబడి లేకుండానే అధిక దిగుబడి

ఖర్జూరం, శ్రీగంధంతో పాటు మామిడి, మునగ మొక్కలతో మిశ్రమ పంటలసాగుచేస్తున్న రైతు..3 ఏళ్ల క్రితం 7 వేల వాటర్ ఆపిల్ మొక్కలను నాటారు. గత ఏడాది నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడో పంట దిగుబడిని పొందుతున్నారు.

Water Apple Farming : మిశ్రమ ఉద్యాన పంటగా వాటర్ యాపిల్ సాగు..పెట్టుబడి లేకుండానే అధిక దిగుబడి

Water Apple Farming

Updated On : August 10, 2023 / 7:43 PM IST

Water Apple Farming : అనంతపురం జిల్లాలో రైతులు మిశ్రమ ఉద్యాన పంటలు సాగుచేస్తూ నష్టాల నుంచి బయట పడుతున్నారు. ఈ మిశ్రమ ఉద్యాన పంటలో వాటర్‌ ఆపిల్‌ సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. జామ, సపోట, బత్తాయి తోటల్లో చేస్తున్న వాటర్ ఆపిల్ సాగు రైతులకు లాభాలు అందిస్తోంది. ప్రజలకు ఇది కొత్తరకం పండు కావడం, కొనుగోలుపై ఆసక్తి చూపుతుండటంతో వాటర్ ఆపిల్‌తో రైతులు ఆశించిన ఆదాయం పొందుతున్నారు.

READ ALSO : Bhagavanth Kesari : ఆయుధం ప‌ట్టుకున్న బాల‌య్య‌.. ఇంకో 70 రోజులే..

వాటర్ యాపిల్, దీన్నే రోజ్ యాపిల్ లేదా గులాబీ యాపిల్ అని కూడా అంటారు.  ఇది చూడటానికి అచ్చం జామపండులా ఉంటుంది. అలాగే బాగా పక్వానికి వస్తే గులాబీ రంగులో ఉంటుంది. ఈ పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి.  ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఈ పండు ద్వారా లభిస్తాయి. వాటర్ ఆపిల్ పండ్లు ఎక్కువగా శీతాకాలం, వేసవిలోనే లభిస్తాయి. కొత్త రకం పండు కావడంతో అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, రావి వెంకటంపల్లి గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ అంతర పంటగా సాగుచేస్తూ.. సత్ఫలితాలను సాధిస్తున్నారు.

READ ALSO : Vijayasai Reddy : ఉన్నమాటంటే ఉలుకెందుకు?.. చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి

అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ అధిక విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ఒకే పంటను సాగుచేయడం వల్ల మార్కెట్‌లో ధరలు పతనమైనపుడు రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ప్రస్తుతం దీనిని అధిగమించడానికి రైతులు అంతర పంటలుగా పండ్ల మొక్కల సాగు చేపడుతున్నారు. ఈ కోవలోనే రైతు సత్యనారాయణ 4 ఎకరాల పండ్లతోటలో అంతర పంటగా సాగుచేస్తున్నారు.

READ ALSO : Vitamin D : విటమిన్ డి లోపంతో డిప్రెషన్‌ సమస్యకు గురికావాల్సి వస్తుందా?

ఖర్జూరం, శ్రీగంధంతో పాటు మామిడి, మునగ మొక్కలతో మిశ్రమ పంటలసాగుచేస్తున్న రైతు..3 ఏళ్ల క్రితం 7 వేల వాటర్ ఆపిల్ మొక్కలను నాటారు. గత ఏడాది నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడో పంట దిగుబడిని పొందుతున్నారు. ఈ పంటకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. చీడపీడలు కూడా అంతగా ఆశించవు. నీటి తడులు కూడా చాలా తక్కువ.. ఒక పూత, పిందె దశలో మాత్రం నీటి తడులు అందింస్తే చాలా.. విపరీతమైన కాత వస్తుంది. మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుండటంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO :  Avoid Eating Raw Vegetables : ఈ నాలుగు రకాల కూరగాయలు, పండ్లు పచ్చిగా తినకూడదు తెలుసా ?

ఈ పంటలకు ఎలాంటి ఎరువులను అందించడం లేదు. చీడపీడలు ఆశిస్తే పలు రకాల కషాయాలు తయారుచేసి పిచికారి చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల.. పెట్టుబడులు చాలా వరకు తగ్గాయి. నాణ్యమైన దిగుబడుల వస్తున్నాయి. మార్కెట్ లో అధిక ధర పలుకుతుండటంతో.. నికర ఆదాయం పొందుతున్నారు.