Vitamin D : విటమిన్ డి లోపంతో డిప్రెషన్‌ సమస్యకు గురికావాల్సి వస్తుందా?

డిప్రెషన్ అనేది విటమిన్ D లోపం వల్ల కలిగే అంశం అయినప్పటికీ, ఇది మాత్రమే దీనికి ముఖ్యమైన కారణం కాదు. డిప్రెషన్ యొక్క సైటోకిన్ మోడల్, ఇది డిప్రెషన్‌కు కారణమని ఇన్ఫ్లమేషన్‌ని ప్రదర్శిస్తుంది. విటమిన్ డి, మొత్తం ఆరోగ్యానికి కీలకమైనప్పటికీ, డిప్రెషన్ కు ఇది మాత్రమే కారణమని చెప్పలేము.

Vitamin D : విటమిన్ డి లోపంతో డిప్రెషన్‌ సమస్యకు గురికావాల్సి వస్తుందా?

vitamin D deficiency

Vitamin D : సూర్యకాంతి శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. విటమిన్ డి గ్రాహకాలు మెదడుతో సహా శరీరం అంతటా ఉంటాయి. మూడ్ రెగ్యులేటర్‌ సిస్టమ్ ను ప్రభావితం చేయటంలో కూడా ఇది కీలకం. ఆఫీసు పని కార్యకలాపాలు, వైకల్యాలు, భౌగోళిక స్థానం, వాతావరణం వంటి అంశాలు శరీరానికి విటమిన్ డి అందే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. సూర్యరశ్మి శరీరానికి తగిన విధంగా తగలటం వల్ల విటమిన్ డి స్థాయిలు మానసిక ఆరోగ్యంపై సమర్థవంతంగా ప్రభావితం చేస్తాయి.

READ ALSO : Avoid Eating Raw Vegetables : ఈ నాలుగు రకాల కూరగాయలు, పండ్లు పచ్చిగా తినకూడదు తెలుసా ?

వివిధ అధ్యయనాలలో విటమిన్ డి లోపం డిప్రెషన్‌తో దగ్గరి సంబంధం కలిగి ఉంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా వారి రక్తంలో విటమిన్ డి ప్రసరణను తక్కువగా కలిగి ఉంటారని పరిశోధనలో తేలింది. విటమిన్ డి లోపాన్ని నివారించిన తరువాత నిస్పృహ లక్షణాలు దగ్గటం వంటి అంశాలు ఒక అధ్యనం ద్వారా వెలుగు చూశాయి. అయితే అదే క్రమంలో ఇతర అధ్యయనాల్లో విరుద్ధమైన ఫలితాలు వెలుగు చూశాయి.

READ ALSO : Intercropping : కొబ్బరి, కోకోలో అంతర పంటగా వక్కసాగు

డిప్రెషన్ అనేది విటమిన్ D లోపం వల్ల కలిగే అంశం అయినప్పటికీ, ఇది మాత్రమే దీనికి ముఖ్యమైన కారణం కాదు. డిప్రెషన్ యొక్క సైటోకిన్ మోడల్, ఇది డిప్రెషన్‌కు కారణమని ఇన్ఫ్లమేషన్‌ని ప్రదర్శిస్తుంది. విటమిన్ డి, మొత్తం ఆరోగ్యానికి కీలకమైనప్పటికీ, డిప్రెషన్ కు ఇది మాత్రమే కారణమని చెప్పలేము. గర్భధారణ సమయంలో తక్కువ విటమిన్ డి స్థాయిలు ప్రసవానంతర మాంద్యంతో ముడిపడి ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది ప్రసవం తర్వాత వారాలు ,నెలల్లో కొత్త గా తల్లులైన వారిపై ప్రభావం చూపిస్తుంది.

READ ALSO : Fish Food : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు

విటమిన్ డి లోపం గౌట్, దీర్ఘకాలిక వెన్నుపూస గాయాలు, స్ట్రోక్ , మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్నవారిలో డిప్రెషన్‌తో ముడిపడి ఉంది. ఇది వివిధ మానసిక ఆరోగ్య పరిస్థితులపై అధారపడి ఉంటుంది. కొన్నిరకాల ఆహార పదార్ధాల నుండి విటమిన్ డి ను పొందవచ్చు. విటమిన్ డి శరీరానికి తగినంత పరిమాణంలో అందించటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలోనే కాకుండా, ఆహారం నుండి కాల్షియం శోషించడంలో కూడా సహాయపడుతుంది. ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాల ద్వారా స్ఫటమైంది.

READ ALSO : Rahul Gandhi: లంకను తగలబెట్టింది హనుమ కాదు.. రావణుడిని చంపింది రాముడు కాదు: రాహుల్

చివరగా, పసిపిల్లల నుండి, పెద్ద వారిదాకా ఈ సమస్య ఎవరినైనా వేధించే ప్రమాదం ఉంటుంది. సూర్యకాంతి హార్మోన్లు మరియు న్యూరోట్రాన్స్మిటర్లను ప్రభావితం చేస్తుంది, మానసిక స్థితిపై సానుకూలంగా ప్రభావం చూపుతుంది. విటమిన్ డి నిరాశను తగ్గిస్తుంది. ఇది ఇతర ప్రయోజనాలతో పాటు సెరోటోనిన్ మరియు కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది.