Fish Food : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు

రైతుల వద్ద కూరగాయలు ఉన్న విషయం తెలిసిన చేపల చెరువుల నిర్వాహకులు గుమ్మడికాయలను వారే కోత కోయించి చెరువుల వద్దకు తెచ్చి ప్రతిరోజు చేపలకు అహారంగా పెడుతున్నారు

Fish Food : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు

Pumpkins

Fish Food : చేపలు పెంపంకం చేపట్టే రైతులు రూటు మార్చారు. ఇటు వాతావరణంలో వచ్చే పెనుమార్పులతో వైరస్ లు విజృబిస్తుండటం.. వాటి నివారణకు అధిక ఖర్చు చేస్తుండటం.. మరోవైపు మార్కెట్ లో  దాణా ధరలు కూడా అధికంగా పెరగడంతో రైతులకు  పెట్టుబడి ఖర్చులు తడిసి మోపవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ లో గుమ్మడి ధరలు తగ్గడంతో వీటినే చేపలకు మేతగా వాడుతూ… పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

ఇదిగో ఇక్కడ చూడండీ.. గుమ్మడి కాయలను ముక్కలు ముక్కలు గా నరుకుతున్న ఇతన్నీ.. ఈ ముక్కలన్ని ఏ కూరకో.. సాంబరుకో అనుకునేరు.. చేపలకు మేతగా వేస్తున్నారు. ఇదేంది.. గుమ్మడిని మేతగా వేయడమేంటి అనుకుంటున్నారు.. అవును పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం మండం, కొప్పర్రు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వర రావు.. చేపలకు గుమ్మడినే మేతగా వేస్తూ.. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటున్నారు.

READ ALSO : Arthritis Problems : ఆర్ధరైటిస్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో చేపలు చేర్చుకోండి!

నర్సాపురం మండలంలో రైతులు కూరగాయల పంటలను అత్యధికంగా సాగు చేస్తుంటారు. దీంతో మార్కెట్‌లో ధరలు తగ్గాయి. పెట్టుబడులు కూడా రాకపోవటంతో కొందరు కూరగాయలపై అశలు వదిలేశారు. రైతుల వద్ద కూరగాయలు ఉన్న విషయం తెలిసిన చేపల చెరువుల నిర్వాహకులు గుమ్మడికాయలను వారే కోత కోయించి చెరువుల వద్దకు తెచ్చి ప్రతిరోజు చేపలకు అహారంగా పెడుతున్నారు. చేపలు కూడా గుమ్మడికాయలను రోజు బాగా తింటున్నాయని తెలిపారు. చేపలకు మేత ధరలు కూడా పెరగటంతో గుమ్మడికాయల ధరలు తగ్గటంతో వాటినే వాడుతున్నామని రైతు చెబుతున్నారు. ప్రజలు కూడా చేపలు కూరగాయలు తినటం చాలా మంచిది అని అంటున్నారు.