Integrated Feeding : వ్యవసాయ వ్యర్థాలతో సంపూర్ణ సమీకృత దాణా తయారీ
పశువు రోజువారీ ఆహార అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మాంసకృత్తులను, అధిక శక్తిని అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం అధిక పోషక విలువలు కలిగిన దినుసులను తగు పాళ్లలో కలిపి మర పట్టించాలి.

Integrated Feeding
Integrated Feeding : పశు పోషణ విషయంలో చాలా మంది రైతులు నేటికీ సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. పాడి పశువులకు పోషక విలువలతో కూడిన దాణాను అందించలేకపోతున్నారు. ఫలితంగా పాల ఉత్పత్తిలో మార్పు కనిపించటం లేదు. పాడి పశువుల నుంచి అధిక పాల దిగుబడిని పొందాలంటే పుష్ఠికరమైన మేపును అందించాలి. అప్పుడే పశువుల్లో ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చునని చెబుతున్నారు రాజేంద్రనగర్ లోని పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. మలిశెట్టి వెంకటేశ్వర్లు..
READ ALSO : Kharif Copper Varieties : ఖరీఫ్ రాగి రకాలు సాగు యాజమాన్యం
పాడి, పంట జంట పదాలుగా కనిపించడమే కాదు, ఒకదాని వృద్ధికి మరొకటి దోహదపడతాయి. వ్యవసాయంలో పశువుల శ్రమ ఎంతో కీలకం. వాటి పేడ, ఇతర విసర్జితాలు పైరుకు బలం. అలాగే పశువులకు బలాన్నిచ్చే దాణాలు పంటలోని వృధా భాగాల నుంచి తయారు చేయొచ్చు. ముఖ్యంగా పాల ఉత్పత్తి సమయంలో, చూడి దశలో, పెరుగుదల దశలో పశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి.
READ ALSO : Fish Farming : మంచినీటి చేపల పెంపకంతో సత్ఫలితాలు సాధిస్తున్న కృష్ణా జిల్లా రైతు
అంటే పశువు రోజువారీ ఆహార అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మాంసకృత్తులను, అధిక శక్తిని అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం అధిక పోషక విలువలు కలిగిన దినుసులను తగు పాళ్లలో కలిపి మర పట్టించాలి. ఆ మిశ్రమాన్నే దాణా అంటారు. ఇందులో జీర్ణమయ్యే మాంసకృత్తులు, పూర్తిగా జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. దాణాలో మాంసకృత్తులు 16 శాతం, జీర్ణమయ్యే పోషక పదార్థాలు 70 శాతం ఉండేలా వివిధ దినుసులు, పదార్థాలను కలుపుకోవాలి.
READ ALSO : Eiffel Tower Bomb Threat: ఈఫిల్ టవర్‌ను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు.. అధికారులు ఏం చేశారంటే
సాధారణంగా చాలా మంది రైతులు పశువులకు దాణాగా తౌడును వేస్తుంటారు. సమీకృత దాణా తయారీకి ఖర్చు కొంచెం ఎక్కువ కావడమే దీనికి కారణం. అయితే మాంసకృత్తులు, పోషకాలు, ఖనిజ లవణాలు తగు పాళ్లలో ఉండే సమీకృత దాణాను అందిస్తే పశువులో పాల దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రెండు లీటర్లకు పైబడి పాలిచ్చే పశువులకు తప్పనిసరిగా సమీకృత దాణాను ఇవ్వాలి. పాలిచ్చే గేదెలైతే ప్రతి రెండు లీటర్లకు కిలో చొప్పున, అదే పాలిచ్చే ఆవులకు అయితే ప్రతి రెండున్నర లీటర్లకు ఒక కిలో చొప్పున దాణా ఇవ్వాలి.