Kharif Copper Varieties : ఖరీఫ్ రాగి రకాలు సాగు యాజమాన్యం
రాగులు.. బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు.. నేడు అనేక ఆరోగ్యసమస్యల వల్ల, తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

Kharif Copper Varieties
Kharif Copper Varieties : మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్ల నేపథ్యంలో చిరుధాన్యాల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. వాణిజ్య పరంగా కూడా వీటికి డిమాండ్ ఉండటంతో రాగిని సాగుచేసే రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగుచేస్తున్నారు. అయితే ఈ పంటలో అధిక దిగుబడిని ఇచ్చే రకాల ఎంపికతో పాటు.. మేలైన యాజమాన్య పద్ధతులను చేపడితే అధిక దిగుబడిని తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీరాం.
READ ALSO : Fish Farming : మంచినీటి చేపల పెంపకంతో సత్ఫలితాలు సాధిస్తున్న కృష్ణా జిల్లా రైతు
చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు వీటి వాడకం చక్కటి పరిష్కారం అంటూ వైధ్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన రాగి విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రాంతాలను బట్టి రాగిని, తైదలు, చోడిగా పిలుస్తుంటారు. రాగులు.. బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు.. నేడు అనేక ఆరోగ్యసమస్యల వల్ల, తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాగిలో ఉండే పోషకవిలువలే దీనికి గల ప్రధాన కారణం.
READ ALSO : Sunny Deol : బాడీలు పెంచడం కాదు.. యాక్టింగ్ చేయండి.. బాలీవుడ్ హీరోలపై సన్నీ డియోల్ వ్యాఖ్యలు..
రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. వీటిని సంకటి, అన్నం, జావ తయారీతోపాటు, తెల్ల రాగులను బేకరీ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు, హైటోకేమికల్స్ ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెరస్ధాయి అదుపులో ఉంటుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి గ్రస్తులకు రాగి మంచి ఆహారం. స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది శ్రేష్ఠమైన ఆహారం.
READ ALSO : Cotton Crop : పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు
ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకుంటారు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. దీంతో రైతులు రాగిని సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు. ఖరీఫ్ లో రాగి పంటను జులై మొదటి వారం నుండి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీరాం.