Home » 10tvagri
పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమల జాబితాలో చేరింది. ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టగొడుగుల లాభసాటి సాగుగా మారింది.
బెండను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు, ఎల్లోవీన్ మొజాయిక్ తెగులు ముఖ్యమైనవి. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకులపైన, అడుగుభాగాన బూడిద వంటి పొరతో కప్పబడి వుంటుంది. తేమ ఎక్కువ వున్నప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువ వుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు.