Turmeric Cultivation : వాతావరణ మార్పులతో పసుపుకు తెగుళ్ల బెడద.. నివారణ చర్యలకు శాస్త్రవేత్తల సూచనలు
తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు.

Turmeric Cultivation
Turmeric Cultivation : సుగంధ ద్రవ్య పంటగా, విశేష వాణిజ్య విలువ కలిగిన పసుపు సాగుకు పెట్టింది పేరు మన దేశం. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగులో వున్న ఈ పంటలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది జూన్ రెండవ వారం నుండి జూలై చివరి వరకు పసుపును విత్తారు.
READ ALSO : Terrac Garden : మిద్దెపై కూరగాయలు, పండ్లు పెంపకం
పంట మొలకెత్తే దశలో తీవ్రమైన బెట్ట పరిస్థితులు, ఆ తర్వాత అధిక వర్షాల వల్ల మొక్కలు అధిక ఒత్తిడికిలోనై చాలా ప్రాంతాల్లో పంట పెరుగుదల ఆశించిన విధంగా లేదు. ఈ దశలో పసుపు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ గురించి రైతాంగానికి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. సుధా జాకబ్.
READ ALSO : Kharif Chilli Cultivation : ఖరీఫ్ మిర్చి సాగుకు సిద్దమవుతున్న రైతులు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం
తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు. ప్రస్థుతం అధిక వర్షాల వల్ల చాలా తోటల్లో నీరు నిలిచి రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా వుండాలంటూ… పసుపు సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. పి. సుధా జాకబ్.
READ ALSO : Weed Control : పత్తిపంటలో కలుపు నివారణ చర్యలు
పసుపులో నాణ్యమైన ఉత్పత్తి, అధిక దిగుబడి సాధించాలంటే నిర్ధేశించిన ఎరువులను సమయానుకూలంగా అందించాలి. పసుపు నాణ్యత పెంచేందుకు రసాయన ఎరువులతోపాటు సేంద్రీయ ఎరువులను తప్పనిసరిగా అందించాలి. రసాయన ఎరువులు పైపాటుగా వేసేటప్పుడు ఆకులపై పడకుండా జాగ్రత్త వహించాలి. నిర్థేశించిన ఎరువులను ఆఖరిదుక్కిలో ఒకసారి, నాటిన 40, 80, 120 రోజులకు క్రమం తప్పకుండా వేయాలి.