Home » Ap And Telangana
మరో మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశంఉంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆమె పర్యటించనున్నారు. మొదటగా రాష్ట్రపతి ముర్ము శ్రీశైలంకు రానున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు వెళ్లనున్నారు.
అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచా�
శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వర్షాలతో పాటు ఆముదాలవలస, రాజాం, రణస్థలంలో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. అటు విశాఖ, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈరోజు అది తుపానుగా మారుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
విద్యుత్ బకాయిల వివాదంపై తెలంగాణ నుంచి తమకు 3వేల 442కోట్లు రావాల్సి ఉందని ఏపీ వాదించింది. అయితే తమకే విద్యుత్ బకాయిల రూపంలో రూ. 12వేల 532 కోట్లు రావాలని తెలంగాణ వాదించింది.
తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 72 మంది విద్యార్థులు, 30మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.
విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి12, 2022న జరుగనున్న సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో సమావేశం జరుగనుంది.
హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల హడావిడి ముగియగానే తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బొమ్మ పడే వేళయింది. కరోనా దెబ్బకు సినిమా థియేటర్లు బంద్ అవగా.. ఇప్పుడు మళ్లీ స్క్రీన్ మీద సందడి నెలకొననుంది. రేపటి నుంచి తెలంగాణ, ఏపీల్లో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.