Central Government : ఏపీ, తెలంగాణకు కేంద్రం పిలుపు.. విభజన సమస్యలు, వివాదాలపై చర్చ
విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి12, 2022న జరుగనున్న సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో సమావేశం జరుగనుంది.

Ap And Telangana
Central Govt call for AP and Telangana : ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాలపై సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంమత్రిత్వశాఖ లేఖ రాసింది. విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి12, 2022న జరుగనున్న సమావేశానికి హాజరు కావాలని కోరింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది.
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తాయి. ప్రధానంగా నీటి పంపకాల విషయంలో వివాదం నెలకొంది. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ అంశంలో తరచూ ఇరు రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. నీటి పంపకాలు, ఉద్యోగుల విభజన, విద్యుత్ పంపిణీ తోపాటు పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిపై ఇరు రాష్ట్రాల మధ్య తరచుగా గొడవ జరుగుతోంది.
YSR Pension Kanuka : వైఎస్సార్ పెన్షన్ కానుక.. జనవరి1 నుంచి రూ.2,500
రాష్ట్ర విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పలు మార్లు సమావేశమై చర్చించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత కేంద్రం… సమస్యలపై చర్చించేందుకు కావాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ సమావేశంలోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో చూడాలి మరి.