Home » AP Assembly
అసెంబ్లీ లాబీలో వైసీపీ నేత, పేర్ని నాని, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఇద్దరు మధ్యా ముందస్తు ఎన్నికల ముచ్చట్లు జరిగాయి. రామ మందిరానికి ఎన్నికలకు ముడిపెడుతు మాట్లాడుకున్నారు.
ఏపీ అసెంబ్లీ నుంచి ఒకేరోజు 15మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.టీడీపీ సభ్యులు సభను అగౌరపరిచేలా ప్రవర్తించారని..సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీలో మీసం తిప్పటాలు, తొడ కొట్టటాలు వంటి దృశ్యాలతో సమావేశాలు సినిమాను తలపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే మీసం తిప్పితే..మరో ఎమ్మెల్యే తొడకొట్టారు. రా చూసుకుందాం అంటూ రా చూసుకుందాం అంటూ సవాళ్లు విసుకున్నారు.
సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీసాలు సినిమాల్లో తిప్పుకోండి అసెంబ్లీలో కాదు అంటూ మండిపడ్డారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జైలులో ఉండగా జరగుతున్న అసెంబ్లీ సమావేశాలు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీలో ప్రవర్తించాలని టీడీపీ శాసనసభ్యులకు మనవి చేస్తున్నానని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
AP Assembly Sessions: 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
స్థానిక సంస్థల కోటాలో విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం ఎనిమిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 42 గంటల 12 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. మొత్తం 27 బిల్లులకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుని వచ్చి అసెంబ్లీలో తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. సాక్షాత్తు స్పీకర్ సమక్షంలోనే తమ ఎమ్మెల్యేలపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైసీపీ ఫ్�